మంత్రులు , ఎమ్మెల్యే లు , నేతలు , కార్యకర్తలు , సినిమా వారు , ముఖ్యమంత్రి ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వీలైనంత మంది నంద్యాల లో పాగా వేసారు. ఇరవై రోజుల నుంచీ ఇదే ప్రాంతం లో కనిపించారు వీరంతా. నేతల ప్రచారానికి మైకుల రణగొణ ధ్వనుల కి బ్రేక్ పడిపోయింది. ఈ ఎన్నికలకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి .. 


- రేపు ఉదయం ఏడుగంటలకి మొదలు అవ్వబోయే పోలింగ్ సాయంత్రం ఆరు వరకూ సాగుతుంది. 
- ఓటు వేసిన తరవాత ఏడు సెకన్ల పాటు ఏ పార్టీకి ఓటు వేసారు అనేది లైటు వెలిగి సౌండ్ వస్తుంది. 
- నంద్యాల నియోజికవర్గ ఓటర్ల సంఖ్య రెండున్నర లక్షల పైమాటే 


- ఓటు రసీదు ని కూడా ఇవ్వడానికి సిద్దం అయ్యింది ఎలక్షన్ కమీషన్ 
- నంద్యాల పట్టణంలో 1,42,628 మంది ఓటర్లు.
- రూరల్ నంద్యాలలో 47,386 మంది ఓటర్లు.


-  గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు.
ఎన్నికల ని భద్రంగా జరిగేలా చూడడం కోసం ఎనభై రెండు ప్రత్యేక స్కాడ్ లు రంగంలోకి దిగారు 
- ఇప్పటివరకూ రూ. 1.16 కోట్ల నగదును సీజ్ చేశారు. 
- దాదాపు మూడొందల యాభై కేసులు నగదు , మద్యం పంపిణీ కి సంబంధించి నమోదు అయ్యాయి 
-2,943 మంది రెండు చోట్ల ఓట్లను కలిగివున్నారు.
-255 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్ట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: