Image result for nandyal bypoll


నంద్యాల ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ రాజకీయాలకు ముఖచిత్రంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములకు కొన్ని వందల ఓట్లే కారణమౌతాయి. ఎవరు గెలిచినా మెజారిటి నామమాత్రమే. అయితే తెలుగుదేశం గెలిస్తే మాత్రం ప్రజలు..

Image result for nandyal assembly candidates


1. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై అధికారమే పరమావధిగా ఊసరవెల్లుల్లా రాజకీయ పార్టీలు మారే దుర్మార్గ రాజకీయాలను, రాజకీయ నాయకులను బలపరిచినట్లే.


2. ఒక దివంగత నాయకుని వారసులకు ఎన్నికల్లో గెలిచే అవకాశమిచ్చి వారి మొసలి కన్నీళ్ళకు చలించి సానుభూతికై తమ వ్యక్తిత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనోన్ముఖంగా పయనించటా సహకరించినట్లే. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ఫణంగా పెట్టిన   అధికార పార్టిని గెలిపిస్తే "ప్రత్యెక రాష్ట్ర ప్రతిపత్తిని వద్దని చెప్పినట్లే"



3. ప్రభుత్వ అధికారులపై అధికార పార్టి నాయకుల దాడులను అంగీకరించినట్లే.


4."మేము వేయించిన రోడ్లపై మీరెలా నడుస్తారు, మేమిచ్చిన దీపాల వెలుగులో మీరెలా బ్రతుకుతారు" అన్న ఆ అధినేత మాటలకు ఓటేస్తే రాస్ట్రమంతా ఆయన సొంత ఆస్థి అని మనమంతా ఆయన దయాదాక్షిణ్యాలపై బానిసల్లా బ్రతుకుతున్నామనే    అర్ధమౌతుంది.


5. అమరావతి ని రాజధాని చేసి కుల ప్రాంత ప్రయోజనాలకు సమిస్థి ఆంధ్ర ప్రప్దేశ్ ప్రయోజనాలను బలిచేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పినట్లె. 


 6. ఎన్నికల వాగ్ధానాలు ఎన్నైనా ఎన్నికల ముందు చేయవచ్చని వాటిని నేరవేర్చక పోయినా ఫరవాలెదని ఒప్పుకున్నట్లే.


 

7.కాల్-మని, కల్తీ, ఇసుక, స్త్రీలపై అత్యాచారాలను జరిపే అన్నీ మాఫియాలను అనుమతించినట్లే.


8.సామాజిక మాద్యమాల్లో చేసే అనేక సెటైర్లకు ఫుల్-స్టాఫ్ పెట్టి రాజ్యాంగ ప్రసాదిత ప్రాధమిక హక్కైన వాక్-స్వాతంత్రానికి తిలోదకాలివ్వటానికి అంగీకరించినట్లే.   



9. ఒక్కసారి అధికార పార్టీకి నంద్యాల ఓటర్లు ఝలక్ ఇస్తే ఇంకా మిగిలిన ఒకటిన్నర సంవత్సరాల కాలములో కొన్నైనా మంచిపనులు జరుగుతాయి. ప్రభుత్వానికి "ప్రజలు ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తారు, ఝలక్ ఇస్తారు జాగ్రత్త" అనే భయమైనా ఉంటుంది. 


ఇలా చెపితే వందల్లో. ఇవి మాత్రం శాంపిల్ అయితే అన్నీ నిజాలే.  



Former MP Lagadapati rajagopal latest survey result on nandyal bypoll


ప్రతిపక్షాలు గెలిస్తేమాత్రం:


అవకాశం దొరకగా భవిష్యత్ పై హోప్ పెరుగుతుంది.


— ఇప్పటిదాగా తిన్న దెబ్బలకు కారణాలు తెలుసుకాబట్టి భవిష్యత్ లో సరిగ్గా ప్రవర్తించే అవకాశం ఉంది. 


— అయినా ఈ ఒక్క నియోజక వర్గములో గెలిస్తే అధికారం చేతికి రాకపోయినా - ఓటుదెబ్బ రుచి తెలుస్తుంది. 


— గెలిస్తే నంద్యాల్లో ప్రతిపక్షం ప్రవర్తనను బట్టి భవిష్యత్ లో ఈ నాయకత్వాన్ని అంగీకరించాలా? వద్దా? అనేదానిపై ఒక        అవగాహనకు రావచ్చు.


— ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష పార్టీకీ కొన్ని లాభాలు..కొన్ని గుణపాఠాలు..కొన్ని నమ్మకాలు ఏర్పడతాయని తెలుస్తుంది. 


— దేశాభివృద్దికి ఆటంకమౌతున్న అవినీతి విషయములో అధికార ప్రతిపక్షాలు దొందూ దొందే. సిబీఐ, ఈడీ కేసులతో కోర్ట్ లో మూలుగుతున్న ప్రతిపక్షనేత ఎంత నేఱస్తుడో ? న్యాయస్థానం తెల్చవలసి ఉంది.



  —  అయితే   స్టీఫెన్-సన్ "బ్రీఫ్డ్ మీ రికార్డెడ్ స్టోరీ" తో స్వయంగా అధికార పక్ష అధినేత ప్రజలముందే రాజు గా చిరస్థాయిగా నిలిచిపోవటం ఒక హై-లైట్. ఆ నేఱం తొమ్మిది కోట్ల ఆంధ్రులు టెలివిజన్ సముఖంగా చూశారు. దానికి న్యాయస్థానం తీర్పులు అవసరం లేదు.  
 


చిన్న అవకాశంతో కులపిచ్చి, బందుప్రీతి, ప్రాంతీయ ఉన్మాదం లేవని నిరూపించుకోలేని అధికార పక్ష అధినేత స్వభావానికి సజీవ సాక్ష్యం "గౌతమీ పుత్ర శాతకర్ణి"  సినిమాకి వినోదపు పన్ను రద్ధుచేసి - అలాంటి చారిత్రాత్మక చిత్రమే అయిన "రుద్రమదేవి"  సినిమాకి వినోదపన్ను రద్దు చేయక పోవటం.  


Image result for nandyal bypoll

మరింత సమాచారం తెలుసుకోండి: