నంద్యాల ఉప ఎన్నిక ఉదయం నుంచీ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మూడేళ్ళ పాటు పాలించిన టీడీపీ కా లేక వైకాపా కా అనే సందిగ్ధం లో ఉన్నాడు నంద్యాల ఓటరు. ఇప్పటికే ఇరవై శాతం వరకూ పోలింగ్ పూర్తి కూడా అయిపొయింది.


కేవలం మూడు గంటల వ్యవధి లో ముప్పై  శాతం పోలింగ్ పూర్తి అవ్వడం విశేషం. యువతరం మొత్తం నంద్యాల పోలింగ్ బూత్ ల ముందర బారులు తీరి కనిపిస్తున్నారు. ఇలా యువతరం ముందరకి వచ్చి పనిగట్టుకుని ఓట్లు వెయ్యడం చాలా వింతగా చూస్తున్నారు నంద్యాల జనాలు.


పెద్దవారి కంటే యువతే ఎక్కువాగా ఈ లైన్ లలో కనిపిస్తూ ఉండడం తో ఇది తమకే మేలు చేస్తుంది అని ఒక పక్క టీడీపీ మరొక పక్క వైకాపా వారు చెబుతున్నారు. సుమారు 2.18 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పటికే 60 వేల మందికి పైగా తమ ఓట్లను వేశారు.


ఈ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు వీవీపాట్ యంత్రాలు పరిచయం అవుతుండగా, తాము ఎవరికి ఓటేశామో చూసుకుంటుంటే ఆనందంగా ఉందని ఓటర్లు వ్యాఖ్యానించారు. యువతరం ఇలా బయటకి వచ్చి ఓట్లు వేస్తూ ఉండడం తో ఈ సారి ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు చాలామంది. ఓటింగ్ చెయ్యడం అందరి బాధ్యత అనే విషయం గుర్తించాలి అని ఈసీ కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: