నంద్యాల ఎన్నికలు జరుగుతున్న కరక్ట్ టైం కి ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ కి యాద్రుచికంగా పాజిటివ్ పాయింట్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం నంద్యాల ఎలక్షన్ ప్రచారం లో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి " చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా పరవాలేదు " అని అనడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువైన సంగతి తెలిసిందే.


దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఎప్పుడో ఈసీ కి ఫిర్యాదు చేసాయి . చాలా చోట్ల స్థానిక పోలీస్ స్టేషన్ లలో కూడా ఈ మాటల పట్ల ఫిర్యాదులు నమోదు అయ్యాయి. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకొని ఈసీ , పోలీసులు సరిగ్గా పోలింగ్ రోజున రెస్పాండ్ అవ్వడం విశేషం.


చంద్రబాబును కాల్చి చంపాలంటూ, ఉరి తీయాలంటూ జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. వెంటనే జగన్ పై కేసు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించింది.


ఒక రాష్ట్రానికి సంబందించిన ముఖ్యామంత్రిని అలా రోడ్డు మీద కాలుస్తా అంటూ మాట్లాడ్డం ప్రజాస్వామ్య దేశం లో అత్యంత దిగజారుడు తనానికి ప్రతీక అని ఈసీ సీరియస్ అయ్యింది. అలంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తమకి అభ్యంతరకరం అని చెప్పిన ఈసీ జగన్ వ్యాఖ్యలు పూర్తిగా ఎన్నికల నియమాలని తుంగలో తోక్కినట్టే ఉన్నాయ్ అని చెప్పింది. తక్షణం జగన్ మీద చర్యలు తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది. ఏ క్షణం లో అయినా జగన్ ని ఈ విషయం మీద పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు లేదా జగన్ ని షో కాజ్ నోటీసులు పంపించచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: