స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు, ఎత్తులు-పైఎత్తులు రాజ‌కీయాల్లో కామ‌న్‌. కానీ, అన్ని తెలిసిన మేధావులు, రాజ‌కీయంగా త‌ల పండిన పొలిటిక‌ల్ నేత‌లు మొద‌టి దానిక‌న్నా రెండో దాన్నే అంటే ఎత్తులు-పై ఎత్తుల‌కే ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా దిగ్రేట్ టీడీపీ లీడ‌ర్ చంద్ర‌బాబు అయితే, సైలెంట్‌గా ఉంటూనే ప్ర‌త్య‌ర్థికి ఎర్త్ పెట్టే టైప్‌! గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో ఇలాంటి ఫార్ములానే ఎంచుకుని ఫుల్ స‌క్సెస్ అయిపోయారు. ఇక‌, ఇప్పుడు ఏపీలో మాత్రం ఆయ‌న‌కు మొగుడు లాంటి జ‌గ‌న్ వ‌చ్చాడ‌ని, గ‌తంలో మాదిరిగా బాబుకు ఎత్తులు-పైఎత్తులు వ‌ర్క‌వుట్ కావ‌ని వైసీపీ నేత‌లు భావించారు. అందుకే బాబుపై రోజా, చెవిరెడ్డి, కొడాలి నాని లాంటి నేత‌లు పెద్ద ఎత్తున పేట్రేగిపోయారు. 

jagan-chandrababu ap herald కోసం చిత్ర ఫలితం

పైన మ‌నం చెప్పుకొన్న‌ట్టు.. బాబు స‌వాళ్ల‌కు-ప్ర‌తిస‌వాళ్ల‌కు దూరం. అందుకే ఆయ‌న జ‌గ‌న్ స‌హా ఇలాంటి నేత‌లు ఎన్న‌న్నా మౌనంగానే ఉన్నారు. అయితే, త‌న‌దైన శైలిలో వైసీపీకి షాక్ ఇవ్వాల‌ని అదికూడా అదిరిపోయే షాక్‌.. దిమ్మ‌తిరిగే షాక్‌.. జ‌గ‌న్ మ‌ళ్లీ కోలుకునేందుకు క‌నీసం ప‌దేళ్ల‌యినా ప‌ట్టే షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. అనుక‌న్న‌దే త‌డ‌వుగా త‌న ప్లాన్ అమ‌లు చేసేశారు. ఇప్పుడు ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కూడా అయిపోతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ దెబ్బ‌కి జ‌గ‌న్ అండ్ కోకి నిజంగానే దిమ్మ‌తిరిగిపోయింది. బాబును ఏమీ అన‌లేక‌.. ఈ షాక్ నుంచి తేరుకోలేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. 


విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ను అటు టీడీపీ, ఇటు వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే, ఇక్క‌డ బలంగా ఉన్న ముస్లిం వ‌ర్గాన్ని చూసుకుని వైసీపీ అధినేత జ‌గ‌న్ రెచ్చిపోయారు. వారంతా త‌న తండ్రి కాలం నుంచి తన‌వ‌ర‌కు త‌మ మాటే వింటున్నార‌ని, త‌మ వెంటే న‌డుస్తున్నార‌ని భావించారు. అంతేకాదు, నిజానికి నంద్యాల గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యించేది కూడా వీరే కావడంతో వారినే ల‌క్ష్యంగా చేసుకుని విప‌రీతంగా ప్ర‌చారం చేసుకున్నారు. ఈ విష‌యంలో బాబు పెద్ద దెబ్బేసేశారు. జ‌గ‌న్ కోలుకోలేని విధంగా దెబ్బ‌కొట్టారు. ముస్లింలు ఎంత‌గానో వ్య‌తిరేకించే బీజేపీతో వైసీపీ అంట‌కాగుతోంద‌ని, మీరు వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసిన‌ట్టేన‌ని సైలెంట్ ప్ర‌చారం ప్రారంభించేశారు. 

jagan-chandrababu ap herald కోసం చిత్ర ఫలితం

అంతేకాదు. త‌న అనుకూల ప‌త్రిక‌లో పెద్ద ఎత్తున బీజేపీ-వైసీపీ భాయి భాయి శీర్షిక‌న పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాయించారు. అంతేకాదు, రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి విష‌యంలో జ‌గ‌న్ చేసిన హ‌డావుడిని ప్ర‌చారం చేశారు. ఆర్ ఎస్ ఎస్‌కు జ‌గ‌న్ కొమ్ముకాస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌ట్టు క‌ట్ట‌నున్నార‌ని, మోడీని క‌లిశార‌ని, పుష్ప‌గుచ్చం ఇచ్చి పొందు చేసుకున్నార‌ని ప్ర‌చారం చేశారు. ఇంకేముంది.. త‌గ‌ల‌రాని చోట  దెబ్బ‌త‌గిలితే.. ఎలా ఉంటుందో జ‌గ‌న్‌కి తెలిసొచ్చింది. అది కూడా పోలింగ్‌కు క‌చ్చితంగా నాలుగు రోజుల ముందు ముస్లిం వ‌ర్గం త‌న నుంచి డైవ‌ర్ట్ అయ్యేలా బాబు చేసిన ప్లాన్ స‌క్సెస్ కావ‌డంతో పిచ్చెక్కిపోయారు. 


వెంట‌నే త‌న మ‌నుషుల‌ను రంగంలోకి దింపి ముస్లిం నేత‌ల‌ను ఓ ప్రాంగ‌ణానికి ర‌హ‌స్యంగా ర‌ప్పించుకుని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయినా కూడా వీరు త‌మ‌తోనే ఉంటార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న భ‌రోసా మాత్రం తిరిగి జ‌గ‌న్‌కి ల‌భించ‌లేదు. అయితే, విచిత్రం ఏంటంటే.. అదే బాబు.. 2014లో బీజేపీతో అంట‌కాగి అధికారంలోకి వ‌చ్చారు. అంతేకాదు, ఈ నెల చివ‌ర‌లో జ‌ర‌గ‌నున్న కాకినాడ కార్పొరేష‌న్‌లో వారితో జ‌త‌క‌ట్టి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నారు. అయినా.. కూడా మిత్ర‌ప‌క్ష‌మే అయినా స‌రే.. అవ‌స‌రాన్ని బ‌ట్టి.. ఆ పార్టీని బూచిలా చూపించి ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌ని తీవ్రంగా దెబ్బ‌కొట్టే రాజ‌కీయాలు చేయ‌డం బాబు సొంతం! మ‌రి జ‌గ‌న్ ఏ విధంగా తేరుకుంటారో?  ముస్లిం వ‌ర్గం ఓట్టు ఆయ‌న‌కు ప‌డ‌తాయా లేదా? అన్న‌ది రిజ‌ల్ట్ వ‌స్తేనే కానీ చెప్ప‌లేని ప‌రిస్థితిని అయితే బాబు క‌ల్పించారు కాబ‌ట్టి .. ప్ర‌స్తుతానికి అయితే, జ‌గ‌న్‌కి మాత్రం కోలుకోలేని షాక్ ఇచ్చార‌నే చెప్పాలి. 


nandyal by poll కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: