అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌లో ఓట‌ర్లు పోటెత్తారు. భారీ ఎత్తున క్యూలు క‌ట్టి మ‌రీ.. ఓటింగ్ చేస్తున్నారు. అటు ఎన్నిక‌ల సంఘం, ఇటు పార్టీలు సైతం వేసిన అంచ‌నాకు మించి ఓట‌ర్లు రావ‌డం నంద్యాల‌లో హుషారెత్తిస్తోంది. ఇక‌, ఇంత మంది జ‌నాభాత‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటార‌ని ఊహించ‌ని పార్టీలు.. ఇప్పుడు ఓట‌ర్ల తీర్పుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. అస‌లు తీర్పు ఎలా ఉంటుంది. ఓటింగ్ శాతం పెరిగింది కాబ‌ట్టి మాకేన‌ని టీడీపీ.. లేదు లేదు వీళ్లంతా మా ఓట‌ర్లే న‌ని వైసీపీ ఇలా.. ఒక‌రిని మించి ఒక‌రు ఆశ‌లు పెట్టుకున్నారు. దీంతో అస‌లు నంద్యాల‌లో ఓట‌ర్ల తీర్పు ఎలా ఉంటుంది? గ‌తంలో ఎలా ఉంది? అనే అంశాల‌ను చూద్దాం. 

bhuma brahmananda reddy కోసం చిత్ర ఫలితం

1955 నుంచి ఇప్పటి వరకూ 14 సార్లు నంద్యాల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు, టీడీపీ మూడు సార్లు, వైసీపీ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, స్వతంత్రులు నాలుగు సార్లు గెలుపొందారు. నంద్యాలలో తొలిసారి స్వతంత్ర అభ్యర్థి గోపవరం రామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు సుబ్బారెడ్డిపై దాదాపు 12 వేల ఓట్ల మెజారితో గెలుపొందారు. 1959, 1967, 1989, 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 


ఇక తెలుగుదేశం పార్టీ 1985, 1994, 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో విజయబావుటా ఎగురవేసింది. వైసీపీ  పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ తన జెండాను పాతింది. అయితే ఎక్కువ సార్లు ఇక్కడ స్వతంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఏ పార్టీకీ నంద్యాల నియోజకవర్గం కొమ్ముకాయలేదు. ఇక్కడ వ్యక్తుల ఆధారంగానే ఎన్నికల జరుగుతాయని గత చరిత్ర చెబుతోంది. ఇక‌, ఉప ఎన్నిక జ‌ర‌గుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ ఇది రెండో ఉప ఎన్నిక‌గానే తెలుస్తోంది. 

shilpa mohan reddy nandyal కోసం చిత్ర ఫలితం

1959లో  ఒక‌సారి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవి రెడ్డి స్వతంత్ర అభ్యర్థి పీఎం రెడ్డిపై కేవలం రెండున్నర వేల ఓట్లు తేడాతోనే గెలుపొందారు. అయితే ఈ ఉప ఎన్నికలో కూడా అప్పుడు నువ్వా? నేనా? అన్నట్లు జరిగిందని చెబుతున్నారు.  వీరిద్దరి గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం 3,602 ఓట్లు మాత్రమే.  అంటే టఫ్ ఫైట్ ఉన్న ప్రతిసారీ మెజారిటీ మూడు వేలకు మించి రాకపోవడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో 30 వేల పైచిలుకు మెజారిటీని గెలిచిన అభ్యర్థి సాధించారు.  సో.. ఇప్పుడు కూడా వార్ నువ్వా నేనా అన్న రేంజ్‌లోనే సాగుతోంది కాబ‌ట్టి మెజారిటీ ఇలానే ఉంటుంద‌ని అంటున్నారు.

nandyal war కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: