భారత దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక దేశంలో నల్లధనం పేరుకు పోతుందని..నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పెద్ద నోట్ల రద్దు చేశారు.రూ.1000,500 స్థానంలో రూ.2000, 500 కొత్తనోట్లు తీసుకు వచ్చారు. ఆ మద్య రూ.200 నోటు కూడా ముద్రిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా  రూ. 200 నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది.


మార్కెట్ లోకి కొత్త రూ.50 నోటు..అందుకేనా..!

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ నోట్లను మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. రూ.100, రూ.500 మధ్య ఎలాంటి డినామినేషన్ లేకపోవడంతో రూ.200 నోట్లకు డిమాండ్ వుంటుందని భావించిన ఆర్బీఐ, కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.  చాలా మందికి రూ.2000 నోటుతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి..అంతే కాదు  రూ.2000 వేల కొత్త నోట్లను దళారులు మాయం చేశారు.


మార్కెట్ లోకి కొత్త రూ.50 నోటు..అందుకేనా..!

దీని కారణంగానే సామాన్యులు తీవ్రఇబ్బందులకు గురైనట్టు గుర్తించిన ఆర్బీఐ.   ఈసారి భారీ మొత్తంలో రూ.200 కొత్త నోట్లు అందుబాటులోకి తేనుంది. నల్లధనం, పన్ను ఎగవేతలు వంటి సమస్యలకు గుణపాఠం చెప్పేందుకే ఈ నోట్లను  తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. అదే విధంగా మార్కెట్ లోకి కొత్త రూ.50 నోటు తీసుకు వస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: