భారత దేశంలో గత కొంత కాలంగా నల్లధనం విపరీతంగా పెరిగిపోతుందని..ప్రతి ఒక్కరూ అక్రమ సంపాదన కోసం వెంపర్లాడుతున్నారని..అందుకోసం దొంగ నోట్ల చెలామణి బాగా పెరిగిపోయిందని దీన్ని నిర్మూలించాలంటే కొత్త నోట్లు తీసుకు రావాలని భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చెలామణి రద్దు చేశారు.  ఇక 1000, 500 స్థానంలో రూ.2000, రూ.500 కొత్తనోట్లు ముద్రించి మార్కెట్ లోకి తీసుకు వచ్చారు.  
Image result for new 200 note on market
కొత్తలో కొన్ని ఇబ్బందులు పడ్డా రాను రాను జనాలకు అలవాటైంది. అయితే రూ.2000 నోటు చిల్లర దొరకడం మరీ ఇబ్బంది కావడంతో మార్కెట్ లోకి కొత్త రూ.200, రూ.50 నోటు తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త రూ. 200, రూ. 50 నోట్లను శుక్రవారం విడుదల చేసింది. దీంతో రూ. 200, రూ. 50 నోట్లు చలామణిలోకి వచ్చాయి.

ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేదికగా కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. నోటు వెనుక వైపున సాంచీ స్థూపాన్ని ముద్రించారు. మన దేశ అత్యున్నత సంస్కృతిని వెల్లడించే క్రమంలో సాంచీ స్థూపాన్ని నోటుపై ముద్రించారు. లేత పసుపు రంగులో ఈ నోటు వస్తోంది.

ఈ నోటు రాకతో కరెన్సీ కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. క‌ల‌ర్ స్కీమ్‌తో పాటు ఇత‌ర డిజైన్‌, జియోమెట్రిక్ ప్యాట‌ర్స్న్ ఉంటాయ‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఉన్న పాత రూ.50 నోటు కూడా చెలామ‌ణిలో ఉంటుంద‌ని ఆర్బీఐ తెలిపింది


మరింత సమాచారం తెలుసుకోండి: