బాలీవుడ్ ఆపాత మధురం "ఆజా రే ఓ దిల్‌ మేరే దిల్‌బర్ ఆజా" మీకు గుర్తుండే ఉంటుంది. ఆ గీతం వింటుంటేనే హృదయం నెమలిలా పురివిప్పి ఆదే ఈ గీతం  భారతీయ క్లాసిక్ మూవీ "నూరీ" (1979) లోనిది. అలాంటి మధుర గీతాన్ని అదీ మన శత్రు దేశం చైనాలో బ్రిక్స్ వేదికపై వినటమంటే మనసు ఆనందతరంగాల్లో ఓల లాడటమే కదా!  ఆ అనుభవం భారత ప్రధాని చైనా ప్రెసిడెంట్ తో కలసి ఐదు దేశాల అధినేతలు అనుభవించారు. చైనా రేడియోలో పని చేసే మహిళా రిపోర్టర్‌ "తంగ్‌ యువాంగై" హిందీలో ఈ పాటపాడి చిన్నపాటి సర్‌ప్రైజ్‌ ని భారత్ కు అందించింది. ఈ అనుభవం ఈ బ్రిక్స్ తొమ్మిదవ వార్షిక సదస్సు ను కవర్ చేయటానికి వెళ్లిన మన మీడియాకు ఊహించని విధంగా మధురానుభవం ఎదురొచ్చింది వీనుల విందు లా.  

chinese reporter on brics summit కోసం చిత్ర ఫలితం

చైనా జియామెన్‌ నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ వార్షిక సదస్సుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ తో కలసి పాల్గొంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన ప్రత్యేకంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ తో సమావేశం కాబోతున్నారు. 

సంబంధిత చిత్రం

ఇదిలా ఉంటే రెండు నెలలపాటు కొనసాగిన డొక్లామ్‌ వివాదం తరవాత ఈ ఇరు దేశాధినేతలు భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సరిహద్దు అంశంతోపాటు ద్వైపాక్షిక ఒప్పందాల అంశం జింగ్‌పింగ్‌-మోదీ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: