"యుద్ధం మా కోరిక కాదు. మా దేశ పౌరుల భద్రత మా బాధ్యత"


"ఒక యుద్ధ పిపాసిని ఎదుర్కోనే విషయంలో ఎంత దూరమైనా వెళతాం, అంత వరకు ఉత్తర కొరియా సమస్యను తన మాటలతో చేతలతో  తార స్థాయికి చేర్చింది" 


"అమెరికా వైపు - అమెరికన్ల పైకి కొన్ని వందల అణుబాంబులు, శతఘ్నులను గురిపెట్టి కూర్చుంది ఉత్తర కొరియా. ఇలాంటి పరిస్థిలో మేం సహనంతో ఉండలేం. యుద్ధం చేయటం మాకు ఆందాన్ని ఇవ్వదు. అది మా ఆకాంక్ష కూడా కాదు. కానీ మా దేశ పౌరుల భద్రత, సార్వభౌమాధికార పరిరక్షణ విషయంలో ఎంత దూరమైనా వెళతాం, ఏ నిర్ణయమైనా తీసుకుంటాం"


"కిమ్ జాంగ్ ఉన్, బెగ్గర్ ఫర్ వార్ , యుద్ధం కోసం అవిశ్రాంతంగా యాచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి దాదాపు పది సార్లు హెచ్చరించినా ఆయన తన విధానాలను యుద్ధ వాంచలను వీడక అణ్వాయుధ పరీక్షలను, దానిని మించి హైడ్రోజన్ బాంబ్ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆరు సార్లు అణుపరీక్షలు చేశారు. ఐరాస హెచ్చరికలతో నైనా దారికి రాని ఆయనను, ఉపేక్షించటం ఇంకా అవసరమా? మనం "అతణ్ని దారికి తేవాలనే"  తపనను, ఆలోచనను వదిలేసి ఈ వేదిక సాక్ష్యంగా తీవ్ర చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి"  అంటూ అమెరికా ప్రతి నిధి నిక్కి హేలి ఐక్యరాజ్యసమితి - భద్రతా మండలి వేదికపై ఘట్టిగా స్థిర నిశ్చయంగా మాట్లాడారు వీటో ప్రయోగించే అధికార మున్న దేశాల సమక్షములో బలంగా వాదించారు. 

nikki haley at UN security council కోసం చిత్ర ఫలితం


దానికి సమాధానంగా చైనా ప్రతినిధి లూజీ  కలగజేసుకుంటూ:


"ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారింది. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని - అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంత ర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేం ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనేఉన్నాం. అయితే కొరియాను అణ్వాయుధాలు వదులు కోవాలని వత్తిడి చేస్తున్న అమెరికా తనకు తానుగా ఆ పని చేయగలదా? చేస్తుందా? అని ప్రశ్నించు కోవాలి"


ఉత్తర కొరియాపై ఆంక్షలను ఇంకా కఠినతరం చేయాలన్న ఆలోచనను గానీ ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ప్రణాళికలను గానీ చైనా - రష్యాలు ఎన్నటికీ సమర్థించబోవు. కొరియా ద్వీపంలో శాంతి సామరస్యాలు నెలకొనాల్సిందన్నది మా అభిమతం. అది నెరవేరాలంటే తొలుతగా అమెరికా - దాని అనుబంద మిత్రదేశం దేశం దక్షిణకొరియాలు కొంత వెనక్కు తగ్గాలి"


"ఉత్తరకొరియాను చుట్టుముట్టి భయపెట్టే మీ తీరు మార్చుకోవాలి. ఈ విషయం లో మీరు కఠినమవుతున్న కొద్దీ వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగానే కఠినతరమౌతారు" అని కటువుగానే సమాధానం ఇచ్చారు.

Nikki Haley speaking (© Volkan Furuncu/Anadolu/Getty Images)


లూజీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ రష్యా ప్రతినిధి కూడా మాట్లాడటం తో ఆగ్రహోధగృరాలైన నిక్కి హేలీ, "ఉత్తర కొరియా విషయం లో సాధ్యమైనన్ని శాంతి యుత పద్దతులలో సహనం తో తాము ప్రయత్నించిన దారులన్నీ మూసుకుని పోయాయ ని, తన సహనం కూడా పరాకాష్టకు చేరిందని, ఐరాస 10 సార్లు హెచ్చరించినా వారు వినిపించుకోవడం లేదని కిమ్ లాంటి యుద్ధపిపాసిని అడ్డుకోవాలన్న తమ సహనం తో కూడిన తమ సామ దాన భేద మార్గాలన్నీ విఫలమయ్యాయని ఇక మిగిలింది దండోపాయం లాంటి తీవ్ర చర్యలకు ఉపక్రమించటమే" నని కృతనిశ్చయం వ్యక్తపరచింది అమెరికా ప్రతినిధి నిక్కి హేలి.


ఐక్యరాజ్యసమితి స్థాపనలోని ప్రధానాశమైన ప్రపంచ శాంతిని కాపాడటం అనే విషయం పై వాదోపవాదాలతో మరుగున పడిపోయింది. ఏ ఇరు దేశాలు యుద్ధ సన్నాహాలు ప్రారంభించినా తనకై తాను ముందుగా రంగంలోకి దిగి ఆ దేశాల మధ్య దౌత్యం నేఱపి యుద్ధం జరగకుండా తన వంతు ప్రయత్నాలు చేయడం లో ఈ నాటి దాకా ఐరాస పలు విజయాలను సాధించి తన ఉనికిని అద్భుతంగా కాపాడుకుందనే చెప్పాలి.


దీనికి మినహాయిపు ఒక్క ఇరాక్ యుద్ధం మాత్రమే. ఇతర అనేక సందర్భాల్లోను ఐరాస జోక్యం శాంతి పరంగా బహుముఖ ప్రయోజనాలనే సమకూర్చింది. కత్తులు దూసిన దేశాలు ఐరాసా జోఖ్యం తో శాంతి పక్షమే వహించాయాని మనందరికీ తెలిసిన నైజం. ప్రపంచ శాంతి పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడిన ఐఖ్య రాజ్య సమితిలో యుద్ధం జరిగినట్లు ప్రకంపనలను సృష్టించిన ఇలాంటి వాగ్యుద్ధ దృస్యాలు దాదాపుగా గతం లో ఎన్నడూ జరగలేదు.

nikki haley at UN security council కోసం చిత్ర ఫలితం


అయితే ఆయా దేశాలకు పాలకులుగా మారుతున్న యువనేతల దురహంకారానికి, మానసిక వైకల్యాన్ని తలపించే దుందుడుకు స్వభావం కారణంగా ఐరాసలోనూ యుద్ధ దృశ్యాలు కనిపించడం ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని కలవరపరుస్తోంది.


అయితే ఇక్కడ అమెరికా లాంటి అగ్రరాజ్య సహనాన్ని అభినందించవలసిందే.  ఐరాసలో యుద్ధాన్ని తలపించే వాగ్యుద్ధ దృశ్యాలు ఎందుకు చోటు చేసుకున్నాయన్న విషయానికి మూల కారణం.


"ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అగ్రరాజ్యం అమెరికాపై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అనే యుద్ధకాంక్షతో  రగిలి పోతున్నాడు. దానికోసమే జీవిస్తున్నట్లు, అదే ప్రాధమిక లక్ష్యం చేసుకుని నిరీక్షిస్తున్నాడు. అదే ఐరాసలో కీలక పాత్ర పోషి స్తున్న దేశం హోదాలో కిమ్ సవాల్ విసురుతున్నా కూడా అమెరికా సాధారణంగా కంటే కాస్తంత ఎక్కువ నిగ్రహన్నే ప్రదర్శిస్తుంది. అయితే అమెరికా సహనానికి చావుదెబ్బ కొడుతూ మొన్న కిమ్ హైడ్రోజన్ బాంబును పరీక్షించటంతో అమెరికా సహనం కూడా పాతాళం స్థాయికి దిగజారినట్లు కనిపిస్తోంది.

un security council meeting కోసం చిత్ర ఫలితం


ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించటం తో ఒక్కసారిగా హిరోషిమా - నాగసాకిల కాలం నాటి పరిస్థితులను ఙ్జపికి తెచ్చు కుని ఐరాస వెనువెంటనే రంగంలోకి దిగిపోయింది. ఐరాసలో కీలక విభాగమైన భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశ పరచింది. ఈ సమావేశానికి అమెరికా సహా భద్రతా మండలిలోని శాశ్వతసభ్య దేశాల హోదాలో రష్యా - చైనా తదితర దేశాలు కూడా హాజరయ్యాయి.

hydrogen bomb test by north korea కోసం చిత్ర ఫలితం


అయితే సమావేశం సాఫీగా సాగుతున్న సమయంలో చైనాతో పాటు రష్యా చేసిన కామెంట్లు ఒక్కసారిగా వేడిని పుట్టించాయి. కిమ్ జోలికి వస్తే, తాము చూస్తూ కూర్చొనేది లేదంటూ ఆ రెండు దేశాలు అమెరికాకు గట్టిగానే హెచ్చరికలు చేశాయి. అప్పటి దాకా కాస్తంత స్థిమితంగానే కూర్చున్న అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ,


"యుద్ధ సన్నాహాలు చేస్తున్న కిమ్ ను నిలువరించే పనిని వదిలేసి, అతడి దాడి నుంచి తమ దేశ ప్రజలను రక్షించు కునేందుకు పథకం రచిస్తున్న తమకే హెచ్చరికలు జారీ చేస్తారా?"  అంటూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

kim jong un కోసం చిత్ర ఫలితం


అంతేకాదు కిమ్ జాంగ్ ఉన్ మాటలతో వినే రకం కాదని ఇక చేతలే లక్ష్యం చేసుకుని యుద్ధాన్నే కోరుకుంటున్నాడని, అందు కు తాము కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పదని" ఐరాస-బధ్రతా మండలి వేదికగా లో అమెరికా ప్రతినిధి  నిక్కీ హేలీ స్పష్టం చేశారు. దీంతో ఆ దేశాల మద్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాల్సిన కార్య్క్రమాలకోసం సమావేశమైన ఐరాసలో నిజంగానే యుద్ధ దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించటమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: