పూసర్ల వెంకట సింధు  అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.  2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.  అంతే కాదు సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.   సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. అయితే బ్యాడ్మింటన్ క్రీడలో తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువు గోపిచంద్‌కి ఆయన శిష్యురాలు పీవీ సింధు టీచ‌ర్స్ డే నాడు ఓ గిఫ్ట్  అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది.  

ఇప్పటి వరకు తన గురువు గురించి ఎంతో గొప్పగా చెప్పే సింధూ ఈ వీడియోలో  గోపీచంద్‌తో సింధు సాగిన ప్రయాణాన్ని అందులో కళ్లకు కనిపించేలా చూపించింది.  తన కోచింగ్ సమయంలో ఎంత హార్డ్ వర్క్ చేశానో అని చెప్పకనే చెప్పింది. ఐ హేట్ మై టీచర్ అనే టైటిల్‌తో ఈ ఫిల్మ్‌ రానుంది. ఈ సంస్థకు సింధు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.  

అయితే సింధూ  టీచర్స్‌డే గోపిచంద్‌కు తన విజయాలను అంకితం చేస్తున్నా, ఇతరులకన్నా మనమీద నమ్మకం ఎక్కువగా ఉంచిన మన టీచర్లను ద్వేషిద్దాం.. ప్లేయర్‌కి- కోచ్‌కి మధ్య అభిమానం, ఆప్యాయత, ద్వేషానికి ఉన్న సంబంధమన్నదే మెయిన్ థీమ్ అంటూ ఆమె తన ట్విట్టర్ లో చమత్కరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: