"సలామీ స్లైసింగ్" అనే మాట ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండరు. దీని అర్ధమేమంటే చాలా సమయస్పూర్తితో కొద్దికొద్దిగా దొంగిలించటం. ఒకే సారి దోచేస్తే జనం గుర్తిస్తారు. అలాకాకుండా మెల్లమెల్లగా రోజుకో మీటర్ దోచేస్తే 1000 రోజుల్లో ఒక కిలో మీటర్ ప్రాంతాన్ని మనం కబ్జా చెయ్యొచ్చు. అరబ్ మరియు ఒంటె కథ తెలుసుగా! ఎడారిలో ఒంటె చలికి వణికి పోతూ డేరా (టెంట్) లో పడుకున్న అరబ్ ను కొంచెం తల దాచుకోవటానికి స్థలమడిగితే అయ్యోపాపం అని ఆ అరబ్ సహృదయంతో సరే అంటాడు. సందు దొరగ్గానే చంకకెక్కే మన నాయకుల తీరులా తల పెట్టుకోవటానికి దొరికిన సందు లో నడుం వరకు నెట్టుకుని వస్తుంది. అరబ్ నిద్రలోకి జారుకోగానే కొద్ది కొద్దిగా మెలమెల్లగా పూర్తిగా లోపలికి వచ్చి అరబ్ ను నిద్రలోనే బయటకు నెట్టేస్తుంది. ఇది సుమారుగా "సలామీ స్లైసింగ్" కు సరిపోయే చక్కని ఉదాహరణ. 


ఇంతకీ ఈ సొద ఎందుకంటారా! రక్షణశాఖకు విభాగమైన "సెంటర్‌ ఫర్‌ ల్యాండ్ వార్‌-ఫేర్‌ స్టడీస్‌‌"లో, మొన్న బుధవారం జరిగిన ఒక సెమినార్‌‌ లో ప్రసంగించిన భారత సైనికాదినేత, బిపిన్ రావత్, చైనాను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్నిశిఖలు పుట్టించి మంటలు రాజేస్తున్నాయి. "చైనా సలామీ స్లైసింగ్ లో ఆరితేరిన అనుభవఙ్జురాలు" అంతే కాదు అందు లో చైనా "పర్ఫెక్షనిష్ట్"  అన్న దోరణిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై చైనా తన అధికార మీడియా స్వరంతో తన గళం విప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 


bipin ravat comments on salami slicing కోసం చిత్ర ఫలితం


ప్రస్తుతానికి డోక్లాం వివాదం ముగిసి, తరవాత భారత చైనా సర్వోన్నత నేతలు సహకారంతో పురోగాభివృద్ది పధంలో ముందుకు నడుద్ధామని పరస్పరం మాటిచ్చుకుని దోక్లాం తదనంతర బ్రిక్స్ సదస్సులో ఇరు దేశాలు ధృఢ బందాన్ని ఏర్పరచు కున్నాయి అనేలా భావింపజేసిన తరుణమది. 


అయితే, భవిష్యత్తులో అలాంటివి చైనా నుంచి మరిన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని, రావత్ తన అనుభావాన్ని చిలికి చిలికి, "యుద్ధానికి సిద్ధంగా ఉండాలని" అన్నారు. అంతేకాదు సరిహద్దుల్లో చైనా సాధారణంగా అనుసరించే విధానమే "సలామీ స్లైసింగ్" అది అనుభవంతో తెలిసిన రావత్ మన సైన్యాన్ని హెచ్చరించారు. అలాగే ఈ పరిస్థితులను పాకిస్థాన్ తనకు అనుకూలంగా మలచుకుని ఉత్తర సరిహద్దుల్లో చొచ్చుకురావడానికి ప్రయత్నించే అవకాశం ఉందని బిపిన్ రావత్ అనుమానించారు. అదే ఆయన ప్రకటన చేశారు. ప్రకటన చేసిన వెంటనే చైనా అవి భారత్ వ్యాఖ్యలా? ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా? అంటూ ప్రశ్నిస్తూ స్పందించింది. 


సలామీ స్లైసింగ్ వ్యూహం అంటే, పరులెవరికీ కనీసం అనుమానం కూడా రాకుండా శతృదేశాలపై రహస్యంగా "సైనికచర్య" లను స్వల్పం గా పలు దఫాలుగా చేపట్టడం. సరిహద్దుల్లోని ఇతర దేశాల భూభాగాలను ఇలా ఆక్రమించి, చిన్న సూది మొన లాంటి రంద్రం క్రమంగా పెరిగి ఒక బిలం అంత రంద్రం ఏర్పడగానే సమస్యను వివాదాస్పదం చేయడం, ఆ తర్వాత బెదిరింపులు, హెచ్చరికలతో ఆ ప్రాంతాన్ని తనలో కలిపేసుకోవడం, ఈ విధానం అమలులో అంత తేలికగా ఉండదు, చాలా సుదీర్ఘ కాలం జరుగుతుంది. అంతిమంగా శతృదేశం ధీటుగా ప్రతిస్పందించే లోపు వారి భూభాగాన్ని తాను ఆక్రమించుకుని, అతి సున్నితంగా కలిపేసుకోవడాన్ని ఆ తరవాత ఇలా సుధీర్ఘ వివాదాలు నేరపి భాధిత దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి తనది తప్పుకాదని భాదిత దేశాన్నే బదనాం చేయటాన్ని "సలామీ స్లైసింగ్ వ్యూహం" అంటారు.  "చైనా సలామీ స్లైసింగ్‌లో దిట్ట" అన్న ఆయన వ్యాఖ్యలపై చైనా ఇంత త్వరగా స్పందించడానికి బలమైన కారణం పైన వివరించినట్లు ఉండటమే. అంటే దొంగతనం చేసినట్లు, ఇతరులు గుర్తించారన్న వేదనే.    
 

దీనికి ఉదాహరణగా, గతంలో చైనా  తానే జమ్మూ కశ్మీర్‌లోని "ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని"  డోక్లాం తరహాలో  దోచుకునే ప్రయత్నమే చేసినప్పటి,  గతానుభవం ఉన్న కారణంగా రావత్ భారత్ ప్రతినిధిగా  ధీటుగా స్పందించారు.  అయితే చైనా వ్యూహాల తో విసిగి వేసారిన భారత్ ఈ వివాదంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేలా చేసి, మన వాదనకు అనుకూలంగా మద్దతు కూడగట్టింది. దీనికి వేగంగా స్పందించిన చైనా తన పరువు పోతుందని భ్రమసి వివాదానికి వీడ్కోలు పలికింది.

bipin ravat comments on salami slicing కోసం చిత్ర ఫలితం



అయితే, ఈ విధానంలో  పండిపోయి సుదీర్ఘ అనుభవంతో  చైనా మెలుకువలు నేర్చుకుంది. ఇలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కొన్ని ప్రాంతాలను ఇలాగే కలిపేసుకున్న చైనా, 1974లో వియత్నాం నుంచి "పారాసెల్‌ దీవు" లను ఇదే వ్యూహంతో సొంతం చేసుకుంది. 1988లో "జాన్సన్‌ రీఫ్‌‌" లను కూడా ఇలాగే కలిపేసుకుంది. 1995లో ఫిలిప్పైన్స్‌, వియత్నాంల భూభాగాన్ని ఇదే పద్దతిలో ఆక్రమించుకుంది. తాజాగా వియత్నాం ఆర్థిక మండలిలో చమురు బావుల ఆక్రమణను మొదలెట్టింది. ఈ విధానం వల్ల నేరుగా యుద్ధం రాదు. కానీ దురాక్రమణ మాత్రం తప్పదు. చైనా వ్యూహం అదే కావటంతో, ఈ  "చిలక్కొట్టుడు విధానం"  అంతా తెలిసిన సరిహద్దు దేశాలు చైనాను నమ్మడం లేదు.  సరికదా!  అసహ్యించుకుంటాయి. బలమైన దేశం కావటంతొ బహిరంగంగా అనటానికి ముందుకురావు. అయితే తాజాగా చైనా మొదలు పెట్టిన చిలక్కొట్టుడు భారత్ లాంటి పెద్ద దేశం తోను, అలాగే నరెంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు లీడ్ చేస్తున్న సమయంలో కాబట్టి చైనాకు  అచ్చి రాలేదు. అదే రాహుల్ నాయత్వం కేంద్రంలో ఉంటే "చికెన్ నెక్" ను చటుక్కున  కొరికేసి గుటుక్కున మింగేసేవాళ్ళే  


అందుకే బిపిన్ రావత్ చెప్పిన మాటలు నిజమన్నట్లు,  బ్రిక్స్ సదస్సులో తీర్మానంపై సంతకం చేసి ఆ సిరాతడి ఆరక ముందే,  నాలుగు రోజులైనా తిరక్క ముందే తెలివిగా చైనా యూటర్న్ తీసుకుంది. పాకిస్థాన్ తో తమ స్నేహం ఎప్పటిలాగే కొనసాగుందని స్పష్టంగా చెప్పింది. "పాక్‌కు సంబంధించినంత వరకు చైనా మూల విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రాంతీయ లక్ష్యాలను ఎదుర్కోవడంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం మద్దతు ఉంటుందని" అని పాకిస్థాన్‌‌ లోని చైనా రాయబారి "సున్‌ వీడాంగ్‌"  ప్రకటించారు. బ్రిక్స్‌ సదస్సులో ప్రస్తావించిన ఉగ్రవాద సంస్థలన్నింటినీ పాక్ ఇప్పటికే నిషేధించిందని పేర్కొన్నారు. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి "వాంగ్‌ యీ"  కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


china takes a clever u-turn on pakistani terror after brics



ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ త్యాగం చాలా గొప్పదని, ఆ త్యాగాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని కూకటివ్రేళ్ళతో పెకలించటంలో  పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని "వాంగ్‌ యీ" పాకిస్థాన్ కు కితాబిచ్చారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి  "ఖవాజా ఆసిఫ్‌"  శుక్రవారం చైనాలో పర్యటించిన సందర్భంగా అక్కడి  మీడియా సమావేశంలో  "వాంగ్‌" పై వ్యాఖ్యలు చేశారు. చైనా-పాక్ లు  ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వాములుగా ఉంటాయని, ఇరు దేశాల మధ్య అనుబంధం మరింతగా బలపడుతోందని స్పష్టం చేశారు. 


ఇదీ చైనా తీరు.  చైనా అధినాయకత్వమేమో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుల్లో భారత అధినాయకత్వంతో ఎంతో తీయగా మాట్లాడుతూ ఉంటే, అంతర్గతంగా మాత్రం సైనిక సరిహద్దుల్లో వారు విషం చిమ్ముతారు.  

bipin ravat comments on salami slicing కోసం చిత్ర ఫలితం

"Salami slicing ref: to a series of many small actions, often performed by clandestine means, that as an accumulated whole produces a much larger action or result that would be difficult or unlawful to perform all at once. The term is typically used pejoratively. Although salami slicing is often used to carry out illegal activities, it is only a strategy for gaining an advantage over time by accumulating it in small increments, so it can be used in perfectly legal ways as well."

మరింత సమాచారం తెలుసుకోండి: