మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రెండస్థుల మత పాఠశాల హాస్టల్‌ లో  చెలరేగిన మంటల్లో విద్యార్థులు, వార్డెన్లు సహా 25 మంది సజీవ దహనం అయ్యారు.  వివరాళ్ళలోకి వెళితే.. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ లో గురువారం వేకువజామున స్థానికంగా ఉన్న ఓ రెండస్థుల మత స్కూల్ హాస్టల్‌ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.  
మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం
ఓ బెడ్‌రూమ్‌లో ఏర్పడ్డ మంటలు కొంత సమయానికే హాస్టల్‌ భవనం మొత్తం వ్యాపించడంతో మరణాలు ఎక్కువ అయినట్లు భావిస్తున్నారు. జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇద్దరు వార్డెన్లు, 23 మంది విద్యార్థులు మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించి మంటలు ఆర్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. జరగాల్సి నష్టం జరిగిపోయిందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఖిరుదిన్ ద్రాహ్మాన్ ఆవేదన వ్యక్తంచేశారు. మరో  పది మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై ప్రధాని నజీబ్‌ రజాక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గడచినా 20 ఏళ్లలో మలేషియాలోని పాఠశాల్లో చోటుచేసుకున్న ఇదే అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదేనని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: