ప్రాంతీయ పార్టీల్లో ఏకస్వామ్యం ఉంటుంది. అక్కడ పార్టీ అధినేతదే ఆధిపత్యం. ఆయన చెప్పిందే వేదం.. ఆయన మాట జవదాటేందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ సాహసిస్తే వారిపై వేటు తప్పదు. ఇక ఆ పార్టీ అధికారంలో ఉంటే ఇక తిరుగుండదు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరీ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు ఓపెన్ టాక్.

Image result for kcr

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో అన్నీ ఏకపక్ష నిర్ణయాలేనా?. అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు రాష్ట్ర కమిటీ.. పొలిట్ బ్యూరో ఏర్పాటే జరగలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీ.. పోలిట్ బ్యూరో ఏర్పాటు చేస్తానని కెసీఆర్ ప్రకటించారు. అయితే జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవులు తీసేసి కో ఆర్డినేటర్స్ ను  పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Image result for kcr

ఆ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు కూడా చేశారు. కానీ జిల్లా కో ఆర్డినేటర్స్ నియామకం కూడా చేపట్టలేదు. తొలుత కేవలం నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేటర్స్ ను నియమించాలని ప్రతిపాదించారు. ఎమ్మెల్యే ఉన్న చోట ఆయనే ఈ బాధ్యతలు చూస్తారు. లేని చోట నియోజకవర్గ ఇన్ ఛార్జిలకు కో ఆర్డినేటర్స్ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. అయితే జిల్లాల్లో ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశాలు జరిగితే ఇబ్బందులు వస్తాయని జిల్లాకు కూడా కో ఆర్డినేటర్ల ను పెట్టాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటివరకూ ఈ నియామకాలు చేపట్టలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందని టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా విధాన నిర్ణయాలు.. కీలక అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలు పెట్టి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.

Image result for kcr

పార్టీ కమిటీల ఏర్పాటు చేయకపోవటంతో… పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేసిన నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ మధ్యే టీడీపీ నుంచి వచ్చిన గుండు సుధారాణికి టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షరాలి బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకట్రెండు పోస్టులుమాత్రమే  భర్తీ అయ్యాయి తప్ప.. అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పోలిట్ బ్యూరో.. రాష్ట్ర కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకూ ఏమీలేవు. ఇది పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఈ కమిటీలు వేయకపోతే పార్టీకి నష్టం చేకూరే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుకు కూడా ఇప్పుడా  పోస్టు తీసేసారంట.. దీన్నిబట్టి కేసీఆర్ ఎంత నియంతృత్వంగా వ్యహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: