తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  అలనాటి సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో చిన్న చిన్న పాత్రలు, ప్రతినాయకుడి పాత్రలు వేస్తూ మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.  హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత ‘ప్రజారాజ్యం’ అనే పార్టీ స్థాపించారు.
Image result for చిరంజీవి
ఎన్నో ఆశలూ..ఆశయాలతో స్థాపించిన పార్టీ ఎక్కువ కాలం నిలబెట్టలేక పోయారు..ఒకదశలో  సొంత ఊరిలో కూడా ఓడిపోవడంతో పాటు.. అనేక స్థానాల్లో డిపాజిట్ లు కూడా దక్కక పరువు పోగొట్టుకున్నారు. ఇక చేసేది లేక ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి బాధ్యతలు నెరవేర్చారు.
Image result for praja rajyam
ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా చీలిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది.  చిరంజీవికి ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.నంద్యాలలో చింరజీవిని చూసి ఒక్క ఓటు కూడా రాలలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న చిరంజీవి వరిసారిగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఢిల్లీ వెళ్లారు.

 ఈ సంవత్సరం వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో  ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.  అంతే కాదు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి క్రేజ్ తగ్గిపోయిందని అనుకున్న వారందరూ.. ‘ ‘ఖైదీ నెంబర్ 150’ చిరు నటన చూసి హ్యాట్సాఫ్ చెప్పడమే కాదు.. బాస్ ఈజ్ బ్యాక్ అని అన్నారు.  
Image result for khaidi no 150
దీంతో చిరంజీవి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. . విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇకపై తన పూర్తి కాలాన్ని ఆయన సినిమాలకే పరిమితం చేస్తారని తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. ఇదే గనక నిజమే అయితే..మెగా ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు ఉండవని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: