ఎన్నికల రోజులకి కనీసం అంటే కనీసం ఏడాదిన్నర టైం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి రగులుతోంది. అనుకున్న టైం కంటే కూడా సార్వత్రిక ఎన్నికలు ముందరే వచ్చేలా ఉన్నాయి అని భయపడుతున్నారు అందరు నేతలూ. రాజకీయ పార్టీలు ఇక లేటు చెయ్యకుండా తమ తమ వ్యూహాలు సిద్దం చేసుకుని అమలు కి రంగం సిద్దం చెయ్యాలని ఆలోచిస్తున్నారు.


తెలంగాణా రాజకీయాలో ఒకసారి చూస్తే మహా కూటమి దిశగా అడుగులు నడుస్తున్నాయా ? అంటే అవును అనే అంటున్నారు విశ్లేషకులు. తెరాస సర్కారు ని గద్దె దించడమే లక్ష్యంగా పని చెయ్యడం కోసం ఎవ్వరు ఎవరితో అయినా పనిచెయ్యడానికి సిద్దం అంటున్నారు.


తమ ఒక్కరి వల్లనే కేసిఆర్ ని కిందకి దించడం అనేది సాధ్యం కాదు అనేది కాంగ్రెస్, టీడీపీ , బీజేపీ అర్ధం చేసుకున్నాయి. సో మహా కూటమి లాంటిది ఏర్పాటు చేసి కేసిఆర్ మీద ప్రతీకారం తీర్చుకుందాం అని చూస్తోంది. తెలంగాణా లో బీజేపీ, టీడీపీ ల కంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.


అఫీషియల్ గా కాకపోయినా అంశాల వారీగా తెలంగాణా లో విపక్షాలు అన్నీ  కొన్ని పాయింట్ ల దగ్గర కలుస్తున్నాయి. కేసిఆర్ మాత్రమె అందరి కళ్ళ కీ కనపడుతున్న లక్ష్యం కావడం తో మహా కూటమి గా జత కట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎలాగూ అన్ని పార్టీల మ‌ధ్యా ఒక స‌యోధ్యాపూరిత వాతావ‌ర‌ణం ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి, మ‌రి కొద్ది రోజుల్లో మ‌హా కూట‌మికి ఒక రూపు వ‌చ్చే అవ‌కాశాలైతే క‌నిపిస్తున్నాయ‌నే చెప్పొచ్చు. మ‌రి, ఈ కూట‌మి సాకార‌మైతే, తెరాస‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి త‌యారైన‌ట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: