టీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాలు, అతని రాజకీయ పోకడలు కి సంబంధించి టీటీడీపీ నేతలలోనే చాలామంది అసంతృప్తి తో ఉన్నారు. విభజన తరవాత పార్టీ మొత్తం ఇంత దారుణంగా కింద పడిపోడానికి ఆయనే కారణం అంటూ అందరూ ఆరోపిస్తున్నారు.


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండి ఉంటె ఇప్పటి టీడీపీ పరిస్థితి వేరేగా ఉండేది అనేది వారి ఆలోచన.


సో చంద్రబాబు ఆంధ్రా కే  పరిమితం అయిపోవడానికి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారమే కారణం అనేది అందరి ఆరోపణ. అయితే వారికి ఇప్పుడు మరొక కొత్త తలనొప్పి వచ్చింది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చొరవ చూపిస్తూ వారితో కలిసి పని చేస్తేనే కేసిఆర్ ని ఎదిరించి నిలవగలం ఆనే ఫీలింగ్ సృష్టిస్తున్నాడు అనీ అది మంచిది కాదు అనేది వారి మాట.


అయితే చంద్రబాబు సైతం ఒకప్పుడు కాంగ్రెస్ తో కలవడం అంటే అది ఆత్మహత్య తో సమానం అన్నారు. కానీ రేవంత్ మాత్రం కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపిస్తూ ఉండడం టీటీడీపీ వారికి కోపాన్ని తెప్పిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: