తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా..తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి సీనీరంగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.   మొదట బిజెపి లో జాయిన్ అయిన విజయశాంతి తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ కోసం పోరాడే సమయంలో కేసీఆర్ తో కలిశారు.  తర్వాత టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన విజయశాంతి మెదక్ ఎంపి గా చేశారు.  ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరిన ఆమె సార్వత్రిక ఎన్నికల సమయంలో ఘోరంగా విఫలం అయ్యారు.  
Related image
ఆ తర్వాత చాలాకాలం పాటు రాజకీయాలకు మాత్రమే కాదు మీడియాకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ మద్య అన్నాడీఎంకే పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వచ్చినా వీటిపై మాత్రం విజయశాంతి స్పందించలేదు.  తాజాగా విజయశాంతికి ఆస్తుల విక్రయం కేసులో మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెన్నై, ఎగ్మూర్‌లోని స్థిరాస్తుల విక్రయానికి సంబంధించి ఇందర్‌చంద్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
Image result for kcr vijayashanthi
ఆస్తిని అమ్ముతానని విజయశాంతి తనతో డబ్బులు తీసుకుని.. మోసం చేసిందని ఇందర్‌చంద్ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. అతడి పిటిషన్ ను విచారణకు తీసుకుంది న్యాయస్థానం. ఈ మేరకు విజయశాంతి హాజరుకు ఆదేశిస్తూ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. చెన్నై, ఎగ్మూర్‌లో విజయశాంతికి చెందిన స్థిరాస్తులను 2006లో తాను రూ.5.20 కోట్లకు కొనుగోలు చేశానని, అందుకు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలను పొంది రూ.4.68 కోట్లు అందించినట్లు తెలిపారు.
Related image
కానీ అదే ఆస్తులను విజయశాంతి వేరొకరికి విక్రయించారని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: