ఇప్పుడు తెలంగాణా ఆంధ్రా రాష్ట్రాలలో ప్రధానంగా చర్చ కి వచ్చిన అంశం కంచే ఐలయ్య ఆయన రాసిన పుస్తకం, ఆయన ప్రవర్తన. వైశ్యులని స్మగ్లర్ లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సీరియస్ అవుతున్నారు ఆ కులం వారు అందరూ.


దీనికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సమాధానం ఇచ్చారు. ఇలా ఒక కులం గురించి మాట్లాడే వ్యక్తులని ఖచ్చితంగా ఖండించాలి అన్నారు రోశయ్య.


సైలెంట్ గా ఉండి ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉన్నంత మాత్రాన వైశ్యులు చేతకానివారు గా చూడవద్దు అన్నారు ఆయన. భావ ప్రకటన స్వేచ్చ ని సరిగ్గా వాడుకోవాలి అనీ దాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత అభిప్రాయాలు మనుషుల మీద రుద్దడం మూర్ఖత్వం అన్నారు రోశయ్య.


కంచే ఐలయ్యనీ ఆయన పుస్తకాన్నీ ఖండిస్తూ జరిపిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న రోశయ్య ఐలయ్య కి మినిమం నాలెడ్జ్ లేదు అన్నారు. ఇటు ఆర్య వైశ్య సంఘాలు ఆ పుస్తకాన్ని నిషేదించాలని పట్టుబడుతుంటే అటు ఐలయ్య దూకుడు పెంచి, మోదీ, అమిత్ షా లు కూడా వైశ్యులే అని, వైశ్యులు బిజెపి కి ఇచ్చే విరాళాల్లో 5%  తెలంగాణ లో ఇస్తే రైతు ఆత్మహత్యలుండవని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: