స్టాఫ్ నర్స్ ల పోస్టుల భర్తీ కోసం అని టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో ఆసక్తికర ప్రశ్నలు కనపడ్డాయి. తాజాగా జరిగిన ఈ పరీక్ష లో తెలంగాణా ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు గమ్మత్తుగా ఉన్నాయి.


 'రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు?' అంటూ ఓ ప్రశ్నను అడిగారు.  దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, బీవీ రాఘవులు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు పేర్లను ఇచ్చారు.


మరో ప్రశ్నగా...  'లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?' అంటూ అడిగారు. లగడపాటి రాజ్ గోపాల అప్పట్లో పార్లమెంట్ లో ఇలా చేసిన సంగతి తెలిసిందే.  


దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నారమల్లి శివప్రసాద్, సుజనా చౌదరిల పేర్లను ఇచ్చారు. తెలంగాణా ఉద్యమం నడుస్తున్న టైం లో తెలంగాణా - ఆంధ్ర ప్రదేశ్ లు తనకి రెండు కళ్ళు అంటూ చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని మనందరికీ తెలిసిందే. ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి అంటూ విమర్శలు గట్టిగానే వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: