అమెరికా శ్వేతజాతి దురహంకారంతో రగిలి పోతుంది అయితే దీంతో గ‌త కొద్దికాలంగా జాత్యహంకార దాడులకు హ‌త్య‌ల‌కు నిలయంగా మారిన అమెరికా, అమెరిక‌న్ల‌కే కాక వ‌ల‌స వ‌చ్చిన వారిని భ‌య‌కంపితులను తన చేష్టల ద్వారా నిర్ణౌయాల ద్వారా చేస్తున్న అమెరికా నుంచి ఒక గొప్ప మానవత్వం ప్రదర్శించిన నిర్ణ‌యం వెలువ‌డింది. 


గత ఫిబ్రవరిలో అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాల కు తాత్కాలిక వర్క్-వీసాను మంజూరు చేసి ఆ దేశం ఒక జాత్యహంకారానికి బలైన ఆమెకు న్యాయం చేసింది. శ్రీనివాస్ కూచిబొట్ల హత్య అనంతరం అంత్యక్రియలకోసం ఆమె భారత్‌కు రావడంతో, అమెరికాలో నివసించే హక్కును కోల్పోయారు. తాను అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన దరిమిలా, ఆమెకు తాత్కాలిక వర్క్-వీసా మంజూరు చేసే నిర్ణయం తీసుకోవటానికి ఆ దేశానికి చెందిన సెనేటర్ కెవిన్ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సునయన దుమాలకు కు వర్క్-వీసా మంజూరయ్యే వరకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. 


srinivas kuchibhotla wife కోసం చిత్ర ఫలితం



ఈ సంవత్సరం ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగిన కన్సాస్ లోని ఆస్టిన్ బార్ లో ఒక శ్వేత జాతీయుడు పెద్దగా కేకలు వేస్తూ "మీ విసా స్టేటస్" ఏమిటి అంటూ భాధితుల వాగ్వాధం జరిపి మరల తిరిగి వచ్చి ఫిస్టల్తో సమాధానం వినిపించుకోకుండానే అవేశం తో జరిపిన కాల్పుల ఘ‌ట‌న‌లో - ఆడం పురింట‌న్ అనే శ్వేతజాతి వ్య‌క్తి ఆస్టిన్ బార్‌ లో కాల్పులు జ‌రిపగా  శ్రినివస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో మరో భారతీయుడు అలోక్ మ‌ద‌సానిపై హ‌త్యాయ‌త్నం కూడా జ‌రిగింది. శ్వేత జాతి వివ‌క్ష‌తోనే ఆడం పురింట‌న్ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తమ పరిశోధన అనంతరం నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపే ముందు "మీ దేశానికి వెళ్లిపోవాలంటూ" ఆడం పురింట‌న్ పెడబొబ్బలు పెట్టిన‌ట్లు సాక్షులు తెలిపారు. నిందితుడు ఆడం పురింట‌న్‌ను అడ్డుకున్న అమెరికా శ్వేత‌జాతీయుడు ఇయాన్ గ్రిల్ల‌ట్ కూడా ఇదే ఘ‌ట‌న‌లో వారికి సహాయంగా నిలిచి ఇంకా మానవత్వం బతికే ఉందని నాడు నిరూపించారు. 


srinivas kuchibhotla wife కోసం చిత్ర ఫలితం

ఆడం పురింట‌న్ అనే శ్వేతజాతి దురహంకారి  


అయితే హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలకు అమెరికాలో భర్త మృతితో సునయన రెసిడెంట్ ప్రతిపత్తిని కోల్పోయారు. భర్త అంత్యక్రియల కోసం భారత్‌కు వచ్చిన ఆమె తిరిగి అమెరికాకు వెళ్ల‌లేకపోతున్నారు. ఆమెను అధికారులు వెనుకకు తిప్పి పంపే అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం. ఎదురైన వీసా సమస్యను పరిష్కరించేందుకు తిరిగి ఆమెకు వీసా ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని కాన్సస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ తెలిపారు.


Kevin Yoder, 115th official photo (cropped).jpg

రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్



ఆయన తో పాటు మరికొందరు కూడా ముందుకు వచ్చారు. అయితే ఈ వీసా స‌మ‌స్య పరిష్కారానికి అందరూ తలకొంత సహాకారం అందించటం త‌ద్వారా ఆమెకు వీస లభించి పెద్ద ఉపశ‌మ‌నం ద‌క్కింది. ఇయాన్ గ్రిల్ల‌ట్‌ త‌ర‌హాలోనే కెవిన్ యోడ‌ర్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. దేశమేదైనా మానవత్వమున్న మనుషులు అక్కడక్కడా ఉండబట్టే ధర్మం తన ఉనికిని చాటుతుంది. 


From left: Srinivas Kuchibhotla, who died; Alok Madasani, who was injured; and Ian Grillot, also injured

మరింత సమాచారం తెలుసుకోండి: