తెలంగాణా లో బీజేపీ భవిష్యత్తు మొత్తం మార్చేయాలి అని చూసిన బీజేపీ ఆశలు నిజం అయ్యే ఛాన్స్ ఎక్కడా కనపడ్డం లేదు. అమిత్ షా ఎంత పెద్ద ప్లాన్ వేసినా హేమా హేమీలు ఎవ్వరూ ఈ పార్టీ లో జేరినట్టు సూచనలు లేవు.


త్వరలో జాయిన్ అవుతారా అంటే అది కూడా డౌట్ అనే అంటున్నారు. కేంద్ర నాయకత్వం కూడా ఎందుకైనా మంచిది అని తెరాస తోనే స్నేహ బంధం కొనసాగించేలా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రభుత్వం పైన నిప్పులు కక్కుతూ ఉంటె కేంద్రం వారు మాత్రం మంచి మాటలతో కూల్ చేస్తున్నారు.


ఈ పరిస్థితి లో బీజేపీ కి తెలంగాణా లో టీడీపీ నే గతి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  రేవంత్ రెడ్డి లాంటి వారు తప్ప మిగిలిన టీ టీడీపీ నేతలు అందరూ బీజేపీ తో పొత్తు ఉంది అనే మాట ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు.


కావాలంటే తెలంగాణా వరకూ టీడీపీ జెండా ని సైతం పక్కకి పెట్టి టీడీపీ గా కాకుండా ఎన్డీయే గా పోటీ చేస్తాం అని వారు అన్న మాటే. ఇక బిజెపి నేతలలోనూ చాలా మంది టిటిడిపితో వుంటే వారి ఓటర్లు యంత్రాంగం ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. ఈ జట్టులో టిఆర్‌ఎస్‌ పరోక్షంగా వత్తాసు నిచ్చినా ఆశ్చర్యం లేదని వారు వాదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: