సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అంటూ కంచె ఐలయ్య రాసిన పుస్తకం మీద ఇంకా వివాదం జరుగుతూనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. విజయవాడ లో యాభై మంది ఆడవారు నిరాహార దీక్షకి దిగడం సంచలనంగా మారిన వేళ , ఆంధ్రా డీజీపీ కంచె ఐలయ్య మీద పోలీసు కేసు నమోదు చెయ్యాలి అని పోలీసులని ఆదేశించారు.


వైశ్య సామాజిక వర్గాన్ని కించ పరిచేలాగా ఆయన పుస్తకం లో మాటలు ఉన్నాయి అనీ, పుస్తకం హెడ్డింగ్ సైతం వారిని తీవ్రంగా మనస్తాపానికి గురి చేసింది అనీ గత వారం రోజులుగా వైశ్యులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.


తమను స్మగ్లర్లుగా పేర్కొన్నారని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. కుల, మతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చించిన వెంటనే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఈ పుస్తకం నిషేధం కి సంబంధించి కూడా లాయర్ ల ద్వారా మాట్లాడి కోర్టుకు ఎక్కే యోచనలో ఉన్నారు ఆర్య వైశ్యులు. డీజీపీ ఆదేశాల తరవాత కేసు నమోదు చేసిన పోలీసులు, ఏ నిమిషం లో అయినా కంచె ఐలయ్య ని అరస్ట్ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ ఐలయ్య ని అరస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రస్తుతం ఉంటోంది అక్కడే కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: