తెలంగాణా లో బీజేపీ పార్టీ ని బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా పావులు కదుపుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత రాం మాధవ్ లెక్కల ప్రకారం చూస్తే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి ముచ్చట పడాలో ఆశ్చర్యపోవాలో అర్ధం కాడు. ఎన్నికలు వస్తూ ఉన్న టైం లో గెలవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ ప్రతీ రాజకీయ పార్టీ చెబుతుంది అనీ అది చాలా సాధారణ విషయం అనీ ఆయన అన్నారు.


అయితే, 2019 ఎన్నిక‌ల విష‌యానికొస్తే తాము గెల‌వ‌డం అనేది అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన అంశ‌మ‌నీ, అది జ‌రిగిపోయింద‌నీ, భాజ‌పా మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం అనేది దాదాపు ఖాయ‌మైన విష‌యంగానే అంద‌రూ చూస్తున్నార‌న్నారు. " ప్రతిపక్షాలకి కూడా మేము రానున్న ఎన్నికల్లో గెలిచి తీరతాం అనే విషయం అర్ధం అయిపొయింది.


అందుకే వాళ్ళు చేత్తులు ఎత్తేసారు. బీజేపీ ప్రభుత్వం రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి చాలా సిద్దం గా ఉంది. దేశం లో 350 స్థానాల వరకూ గెలవాలి అనే లక్ష్యం తో మేము ఉన్నాం. గెలుపు కంటే ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తాం అనేది మాత్రమే మాకు ప్రస్తుతం ఉన్న లక్ష్యం " అన్నారు ఆయన.


తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఒక ఎంపీ స్థానం ద‌క్కించుకున్నామ‌నీ, మిగ‌తా ప‌ద‌హారు స్థానాల్లో కూడా విజ‌యావ‌కాశాలు మెరుగుప‌ర‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌న్నారు. బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా అనడం వేరు , గెలిచి తీరతాం అనడం వేరు. ఇదంతా చూస్తుంటే అతి విశ్వాసం లాగా కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం రావాలి అని కోరుకోవడం లో తప్పు లేదు కానీ ఎందుకు వస్తుంది అని అంత ధృడంగా ఉన్నారు అనేదాని మీద ఒక్క మాట సమాధానం చెబితే బాగుండేది రాం మాధవ్ గారూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: