పక్కనే ఉంటుంది కానీ పక్కలో బల్లెం లాగా మన నెత్తిమీద ఎక్కి తాండవం చెయ్యాలి అనుకుంటోంది చైనా దేశం. కొద్ది కాలం క్రితం నేరుగా ఇండియా లో చొరబడే ప్రయత్నం చేసి ఇండియన్ ఆర్మీ గట్టిగా ప్రతిఘటన చేస్తే వెనక్కి తగ్గిపోయిన ఈ దేశం ఇప్పుడు మరొక కొత్త రూపం లో ఇండియా ని కెలికే పనిలో ఉంది. నేపాల్ సరిహద్దుల్లో కలిసే కీలక రోడ్డు మార్గం చైనా మొదలు పెట్టినట్టు ఆ దేశం మీడియా చెబుతోంది.


టిబెట్ లోని జిగాజే ఎయిర్పోర్ట్ జిగాజే నగరం మధ్యన దాదాపు నలభై కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ని పౌర సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తారు అని తెలుస్తోంది. ఈ రోడ్డు వాణిజ్య పరంగా ఉపయోగపడుతుంది అనే వంకతో నిర్మించినా నిజానికి సైనిక విస్తరణ పరంగా కథ నడుపుతోంది చైనా. జీ 318 అనే రహదారి రెండు పాయలుగా విడిపోతోంది , ఒకటి జిగాజే కి వెళ్ళగా మరొకటి అరుణాచల్ సరిహద్దుల్లో ఉన్న నింగ్చీ కి వెళ్తుంది.


చైనా రహదారులు అన్నీ కూడా చాలా అధునాతనంగా నిర్మిస్తున్నారు. రోడ్ల మీద భారీ సైనిక వాహనాలు తిరిగేలా , రక్షణ విమానాలు దిగేలా నిర్మిస్తున్నారు వీటిని.


నేపాల్ కు రోడ్డు సౌకర్యం మెరుగుపర్చేందుకు చైనా ఆగమేఘాల మీద కృషి చేస్తోంది. అయితే దీని వెనుక చైనా స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనేది తేటతెల్లం అవుతోంది. భారత్ కి పూర్తి సన్నిహిత దేశంగా ఉన్న నేపాల్ ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం కూడా ఈ రోడ్డు తో జరుపుతోంది చైనా. ఒకే ఒక్క రోడ్డు తో నేపాల్ ని ఫ్రెండ్ గా మనల్ని శత్రువు లు గా మార్చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: