ఉప ఎన్నికకి వెళ్లి తన ప్రభుత్వం సత్తాని పూర్తిగా చాటి .. కాంగ్రెస్ ని తుంగలో తొక్కి ఒకే దెబ్బతో రెండు పిట్టలు అనిపించుకోవాలి అని కెసిఆర్ ఆలోచన. నల్గొండ లో ఎంపీ గా ఉన్న గుత్తా సుఖేందర్ తో రాజీనామా చేయించి డిసెంబర్ లో కానీ జనవరి లో కానీ ఉప ఎన్నికకి వెళ్లి కాంగ్రెస్ ఇలాఖాలో తమ ప్రతాపం చూపించాలి అని కెసిఆర్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఉవ్విళ్ళు ఊరుతున్నారు.


అయితే మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కెసిఆర్ నిర్ణయం పట్ల పార్టీ లోని కొందరు సీనియర్ లు ఓకే చెప్పలేదు అనీ, కెసిఆర్ దూకుడు కి వీళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు అనీ తెలుస్తోంది.


నిజానికి ఉప ఎన్నికలు రావాలి దాంతో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేదాని పట్ల కెసిఆర్ ఫుల్ క్లారిటీ తో సిద్దంగా ఉన్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి అక్కడా సత్తా చాటాలన్నది ప్రణాళిక.


దీనికోసం ఇప్పటికే వారిని సిద్దం కూడా చేసారు కెసిఆర్. కానీ సీనియర్ ల లాజిక్ ఏంటంటే ఉద్యయం జరుగుతున్న టైం లో ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి వెళ్ళినంత ఈజీ కాదు ఈ వ్యవహారం అని. అధికారం లో ఉండి సొంత ప్రజా ప్రతినిధులతో రాజీనామా చేయించి ఎలక్షన్ కి వెళ్ళడం పెద్ద రిస్క్ అవుతుంది అంటున్నారు వాళ్ళంతా. 

మరింత సమాచారం తెలుసుకోండి: