సునీతా రాణా.. ఇప్పుడు ఈ పేరును వైసీపీ నేత‌లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట‌! ఆమె ఎవ‌రై ఉంటుందా? అనే ఆ తృత వారిలో పెరిగిపోతోంద‌ట‌! త‌మ‌కు తెలిసిన వారిని ఆరా తీసి మ‌రీ.. ఆమె గురించి వీలైనంత తొంద‌ర‌గా తెలుసు కుందామ‌ని ఆరాట‌ప‌డుతున్నారట‌. అస‌లు ఇంత‌కీ ఆమె గురించి ఎందుకు వైసీపీ నేత‌లు వెతుకుతున్నారు? అనే క‌దా మీ సందేహం! ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప క్క ర్లే దు! ఏపీలోనే కాదు విదేశాల్లోనూ ఆయ‌నకు అశేష అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యా న్స్ జాబితా లో హీరో యిన్స్ కూడా చేరిపోయార‌ట‌. జ‌గ‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెబుతోంది అప్‌క‌మింగ్ హీరోయిన్ సునీతా రాణా!


దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడిగా జ‌గ‌న్ ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఆయ‌న డ్రెస్సింగ్‌ను కూడా ఫాలో అయిన వారు ఉన్నారంటే ఆశ్య‌ర్చం అనిపించ‌క మాన‌దు. ఇక ఆయ‌న దూకుడిగా వ్య‌వ‌హ‌రించే తీరు.. కొంత‌మందికి నచ్చ‌క‌పోయినా.. మ‌రికొంత‌మందికి న‌చ్చుతుంద న‌డంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు హీరోయిన్ సునీతా రాణా ఫిదా అయిపోయింది. ఇక జ‌గ‌న్‌ను ప్ర‌శంస‌లతో ముంచెత్తేసింది. అంతేకాదండోయ్ జ‌గ‌న్‌ను రోల్ మోడ‌ల్‌గా తీసుకోవాల‌ని యువ‌త‌కు సూచ‌న‌లు కూడా ఇచ్చేస్తోందీ బ్యూటీ!! ఆమె స్టేట్‌మెంట్‌తో జ‌గ‌న్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు పిచ్చపిచ్చగా నచ్చేశాడని హీరోయిన్ సునీతా రాణా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ ఊహించని పరిణామానికి జగన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన వాగ్ధాటితో ప్రభుత్వానికి చెమటలు పట్టించే జగన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అభిమానులున్నారో తెలిసిందే. తాజాగా జగన్ అభిమానుల జాబితాలో హీరోయిన్లు చేరుతున్నారు. పంజాబ్‌లో పుట్టి పుణేలో పెరిగి మోడల్ కమ్ హీరోయిన్ అయిన సునీతా రాణా తెలుగు, తమిళంలో హీరోయిన్ గా రాణిస్తోంది. 

sunita rana కోసం చిత్ర ఫలితం

ఒక ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు అంటే ఇష్టమని, అందుకే నిత్యం వార్తలు చూస్తానని, వాటిలో వైఎస్ జగన్ ను సభలు పెట్టినప్పుడు వచ్చే జనాన్ని చూసి ఫిదా అయిపోయినట్లు జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాదు రాజకీయాల్లో వచ్చే యువత జగన్ ను రోల్ మోడల్ పెట్టుకోవాలని సూచించింది. సునీత ఎవరో తెలుసుకు నేందుకు వైసీపీ అభిమానులు తెగ ప్రయత్నించేస్తున్నారట. ఈ దెబ్బ‌కి అమ్మ‌డికి బోల్డంత పాపులారిటీ వ‌చ్చేయ‌డం ఖాయం మ‌రి!!


మరింత సమాచారం తెలుసుకోండి: