గత కొంత కాలంగా అమెరికాపై ప్రకృతి తీవ్ర కోపంగా ఉందా అనిపిస్తుంది.  ఇప్పటికే వరదలు, భూకంపాలతో ఎంతో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.  తాజాగా మరోసారి  మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం సంభవించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. వందలాది మంది సజీవ సమాధి అయ్యారు. మట్టిముద్దగా మెక్సికో సిటీ మారింది. మధ్య మెక్సికోలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.

దక్షిణ మెక్సికోలో 7.4గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సెంట్రల్ మెక్సికోలో సంభవించిన ఈ భూకంపం దాటికి భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఇంకా శిథిలాల కింద అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది.దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకంపం 1985లో సంభవించింది.
7.1 magnitude quake kills over 139 as buildings collapse in mexico
స‌రిగ్గా 32ఏళ్ల క్రితం 1985 సెప్టంబ‌రు 19న‌ మెక్సికోలో భూకంపం సంభవించి 10 వేల మంది చనిపోయారు. నగరంలో కనీసం 40 భవంతులు కుప్పకూలాయని, వాటిల్లో రెండు పాఠశాలలు కూడా ఉన్నాయని వెల్లడించారు. భవంతుల సెల్లార్లలో ఉన్న కార్లు నుజ్జునుజ్జయ్యాయని, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.

కాగా, మెక్సికో నగరానికి 100 మైళ్ల దూరంలో ప్యూబ్లా వద్ద భూకంప కేంద్రం ఉండగా, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా బిలియన్ల కొద్దీ ఆస్తి నష్టం సంభవించిందని, మొత్తం ఆస్తినష్టం అంచనాలు అందేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. పలు సీసీ కెమెరాల్లో రికార్డయిన భవంతుల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: