భారత దేశంలో గత కొంత కాలంగా దొంగబాబాలు విపరీతంగా పుట్టుకు వస్తున్నారు.  భక్తి అనే ముసుగులో మూశ విశ్వాసాలను క్యాష్ చేసుకుంటూ ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  ఆశారాం బాపూ, డేరాబాబా, రాంపాల్.. యవ్వారాల తర్వాత ఇప్పుడు తాజాగా ఫలహారీ బాబా తెరపైకొచ్చాడు.  ఇక ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ రోహ్ తక్ జైలులో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చత్తిస్‌గఢ్ బిలాస్‌పూర్‌కు చెందిన ఈ బాబా ..లా చదువుకున్న ఓ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు.

ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఈమె తనకు దూరపు బంధువైన ఈ దగ్గరకు వెళ్ళింది. పూజా కార్యక్రమంలో ఉన్న బాబాను సందర్శించుకోవడానికి వెళ్లిన ఆ యువతి చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు.  అయితే ఆ విద్యార్థిని తప్పించుకుని అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్ పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిమిత్తం బాబా ఆశ్రమానికి వెళ్లారు.  ఇది తెలుసుకున్న బాబా వెంటనే అక్కడ నుంచి పరారీ అయ్యాడు. ఆశ్రమం నుంచి పరారై అనారోగ్యం సాకుతో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉన్న ఫలహారీ బాబాను చూసిన పోలీసులు అతడ్ని విచారించకుండానే వెనక్కి వచ్చినట్టు తెలిసింది.  అయితే ఇలాంటి దొంగ బాబాలను కఠినంగా శిక్షించి న్యాయాన్ని కాపాడాలని ప్రజలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: