2019 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండడంతో తప్పకుండా తమదే అధికారమని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసింది. అందుకే పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు దక్షిణభారతాన్నే ఎక్కువగా టార్గెట్ చేసింది.

Image result for bjp

          ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. కర్నాటకలో మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి లేనట్టే. కర్నాటకలో వచ్చిన అధికారాన్ని కూడా పోగొట్టుకుని అభాసుపాలైంది. ఇప్పుడు మళ్లీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కత్తిలాంటి 30 మందిని ఎంపిక చేసిన మోదీ – షా ద్వయం వారికి బృహత్తర బాధ్యతను కట్టబెట్టింది.

Image result for bjp

          దేశవ్యాప్తంగా బీజేపీకి ఏమాత్రం పట్టులేని 130 లోక్ సభ నియోజకవర్గాలను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఒక్కొక్కరికి ఐదు నియోజకవర్గాలను అప్పగించింది. బీజేపీని ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం వారి పని. ఎలాగైనా ఈ 130 నియోజకవర్గాల్లో పాగా వేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు యా బాధ్యులను క్షేత్రస్థాయికి పంపించింది.

Image result for bjp

          దేశవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలను బీజేపీ మూడు విభాగాలుగా విడగొట్టింది. కంచుకోటలు, ఓ మోస్తరు బలమున్నవి, కనీసం పట్టులేనివి.. వీటిలో ఏమాత్రం ప్రభావం లేనివాటిపైనే బీజేపీ దృష్టిపెట్టింది. కంచుకోటలు ఎలాగూ వారిఖాతాలోనే ఉంటాయి. ఓ మోస్తరు బలమున్నచోట ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లేదా బలమైన వ్యక్తులను బరిలోకి దించడం ద్వారా కైవసం చేసుకోవచ్చని భావించింది. అయితే ఏమాత్రం ప్రభావం లేనిచోట్ల మాత్రం బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని పట్టు పెంచుకోవాలని ఆలోచిస్తోంది.

Image result for bjp

          ముఖ్యంగా దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో పట్టు పెంచుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు కాబట్టి.. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బలం పెంచుకోవాలనేది ప్లాన్. మరి బీజేపీ ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: