ఈ మద్య ఏపీలో వైసీపీ నేతలకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల షాక్ నుంచి కోలుకోని వైసీపీకి కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఛేదు అనుభవం ఎదురైంది. తాజాగా వైసీపీకి ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌, ఆయన సతీమణి విజయలక్ష్మిపై సిబిఐ షాక్ ఇచ్చింది.  దాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేశ్‌తో పాటు ఆయన భార్య విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సురేశ్‌ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయలక్ష్మీ ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు.  కాగా, ఆదాయానికి మించి రూ.కోటికి పైగా ఆస్తులు కల్గి ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మిపై సిబిఐ కేసును నమోదు చేయడం సంచలనంగా మారింది.

ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ కేసు నమోదు చేసింది.2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ పేర్కొంది. 1994 బ్యాచ్‌కు చెందిన విజయలక్ష్మి ఇండియన్ రైల్వే సర్వీస్‌లో చేరారు. ఆమె ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: