భారత దేశంలో గత కొంత కాలంగా దొంగ బాబాల అరాచకాలు పెచ్చు మీరుతున్నాయి.  ప్రజల మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని వారి వద్ద అందినంత దోచేస్తున్నారు.  కొంత మంది బాబాలు మహిళలను లైంగికంగా వేధించడం..వారిపై అకృత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా ఎన్నో చూశాం.  ఇక భారత దేశంలో పెను సంచలనాలకు నాంది పలికిన డేరా బాబా రామ్ రహీం గుర్మిత్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష కోర్టు విధించింది.

ప్రస్తుతం డేరా బాబా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే డేరా సచ్ఛా సౌధలో రామ్ రహీమ్ సింగ్ దారుణాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. డేరా బాబా సాధ్వీలతో పాటు, స్కూల్ విద్యార్థులపై డేరాబాబా లైంగిక వేధింపులకు పాల్పడేవారని తేలింది.  డేరాబాబా అకృత్యాలపై కొందరు మాజీ ఉద్యోగులు, అనుచరులు ఈ విషయాన్ని విచారణ అధికారులకు వివరించారు. తాజాగా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.  
రామ్ రహీమ్ సింగ్ హనీప్రీత్ శృంగారంలో మునిగితేలేవారు
రామ్‌రహీమ్‌తో తన మాజీ భార్య హనీప్రీత్‌ శృంగారంలో మునిగితేలిపోవడాన్ని తాను చూశానని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. ఈ విషయం రామ్ రహీమ్‌కు తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. డేరాసచ్ఛాసౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుకి వెళ్లిన నాటి నుంచి అతనిని తప్పించేందుకు ప్రయత్నించిన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.  
Image result for ram rahim singh honeypreet singh
మరోవైపు ఆమె దొరికితే విచారణలో ఆశ్రమం గుట్టుమట్లు వీడే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావించారు.ఆమె ఆచూకీ చెప్పిన వారికి నజరానా ఇస్తామని హర్యానా, పంజాబ్, బీహార్, రాజస్థాన్ లలో ప్రకటనలు కూడా వేయించారు. ప్రస్తుతం హనీ ప్రీత్ సింగ్ నేపాల్ సరిహద్దుల్లో వాంటెడ్ పాంప్లెట్లు కూడా అతికించారు.   మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: