ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ఎన్డీ టీవీ ని స్పైస్ జెట్ సంస్థ సొంతం చేసుకునట్టు వస్తున్న వార్తలని ఆ సంస్థ ఖండించింది. ఈ విషయం కి సంబంధించి బాంబే స్టాక్ ఎక్చేంజ్ కి కూడా ఒక లేఖని పంపింది ఈ టీవీ ఛానల్.


తమ ఛానల్ వేరేవారి చేతిలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో ఏదీ నిజం కాదు అనీ దయచేసి నమ్మవద్దు అని కోరుకున్నారు ఆ సంస్థ సీనియర్ అధికారులు.


1988లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రారంభించిన ఎన్‌డీటీవీ త్వరలో చేతులు మారబోతోందంటూ వార్తలు వచ్చాయి. స్పైస్ జెట్ కి చెందిన అధినేత అజయ్ సింగ్ దీనిని కొననున్నారు అనే వార్త మార్కెట్లో పెను సంచలనం అయ్యింది ఈ వార్త రాగానే ఎన్డీ టీవీ షేరు ఒక్కసారిగా ఐదు శాతం పెరిగిపోయింది.


డీల్ తర్వాత అజయ్ సింగ్‌ కు 40 శాతం, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు 20 శాతం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌డీటీవీకి కష్టాలు మొదలైనట్టుగా ఈ వార్తల సారాంశం. 


మరింత సమాచారం తెలుసుకోండి: