తన వివాదాస్పద పుస్తకం కి సంబంధించి ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో అడుగు పెట్టిన కంచె ఐలయ్య భావోద్వేగాల్ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం తనకి లేదు అన్నారు. ఎవరినీ కించ పరిచేలాతాను వ్యాఖ్యలు చెయ్యలేదు అని అన్నారు.


చరిత్ర ని రాసే ప్రయత్నం చేస్తూ పరిశోధన లో బయట పడిన అనేక విషయాల సమాహారం ఆ పుస్తకం లో పెట్టాను తప్ప సొంతగా కథలు రాసే నైజం తనది కాదు అన్నారు ఐలయ్య . ఎవరినో ద్వేషించాల్సిన లేదా విమర్శించాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.


త్వరలో హరప్పా నాగరికతకు సంబంధించిన పుస్తకాన్ని రాస్తానని ఆయన చెప్పారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం సమాజ స్వరూపాలను రాస్తూ వచ్చిన తొలి పుస్తకాలని ఆయన అన్నారు. ఆ పుస్తకాలలో కూడా కులాల ప్రస్తావన ఉంది కానీ వారు ఎవ్వరూ ఎప్పుడూ ఎవ్వరికీ క్షమాపణ కోరలేదు కదా అని గుర్తు చేసారు ఐలయ్య.


శ్రీ కృష్ణుడు కి ఎందరు భార్యలు ఉన్నారు అనేదాని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అనీ ఇలాంటివి సహజంగా జరుగుతాయి అనీ వాటిని ఆపే ప్రయత్నం ఒక మతం , కులం పేరు చెప్పు చెయ్యకూడదు అన్నారు ఐలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: