నంద్యాల ఉప ఎన్నిక విషయం లో టీడీపీ చూపించిన స్పెషల్ శ్రద్ధ అందరం చూసిందే. ఉప ఎన్నిక ఉంటుంది అన్న విషయం తెలిసిన దగ్గర నుంచీ నియోజికవర్గాల మీద స్పెషల్ దృష్టి పెట్టారు. నిధులని గుమ్మరించడం దగ్గర నుంచీ అప్పటికప్పుడు ఇన్స్టంట్ అభివృద్ధి దిశగా శంకుస్థాపన లు చేసేసారు. ప్రజలకి వరాలు ఇచ్చేసారు, ప్రచారం విషయానికి వస్తే మంత్రులు నంద్యాల లో పూర్తి మకాం వేసారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా ఎన్నడూ లేనంతగా తొమ్మిది రోజులు నంద్యాలలో గడిపారు.


నియోజికవర్గాల వారీగా నంద్యాల ని విభజించి ఎవరి  బాధ్యతలు వారు పంచుకున్నారు. సింగరేణి ప్రాంతం లో కూడా ఇప్పుడు అలాంటి హడావిడే కనిపిస్తోంది అంటున్నారు స్థానికులు.నంద్యాల‌లో టీడీపీ చేసిన హ‌డావుడే, ఇక్క‌డ తెరాస చేస్తోంది. సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల్ని తెరాస చాలా సీరియ‌స్ గా తీసుకుంది.


అధికార పార్టీ సీరియ‌స్ గా తీసుకుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో నంద్యాలలో చూసిందే ఇక్క‌డా చూస్తున్నాం! సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల విషయం లో ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదు అని కెసిఆర్ పట్టుదల తో ఉన్నారు.అధికార పార్టీ తరఫున కార్మికుల సంక్షేమం కోసం ఎన్ని ప్రోగ్రాం లు చేపడుతున్నా ఎక్కడ అజాగ్రత్త ఉండద్దు అని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసారు.


దీంతో తెరాస నేతలు సింగరేణి గనుల వైపు పని పెట్టుకున్నారు. అధికార పార్టీ కార్మిక సంఘ‌మైన టి.బి.జి.కె.ఎస్‌.ను ఎలాగైనా గెలిపించి తీరాల‌నే ఒత్తిడి తెరాస నేత‌ల‌పై ఉంది. పార్టీ ఇత‌ర కార్య‌క‌లాపాల‌ను కొన్నాళ్లు ప‌క్కన‌ పెట్టి, సింగ‌రేణిపై దృష్టి పెట్టాల‌ని నాయ‌కుల‌కు కేసీఆర్ చెప్పార‌ట‌. దీంతో కొత్త‌గూడెం, మ‌ణుగూరు, ఇల్లెందు, స‌త్తుప‌ల్లి ప్రాంతాల పార్టీ బాధ్య‌త‌ల్ని నేత‌లు పంచుకున్నారు! కార్మికులని ఆకర్షించడం కోసం అన్నట్టు దీపావళి, దసరా బోనస్ లు కూడా కెసిఆర్ సర్కారు ప్రకటించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: