ఎంతో కాలం గా ఎదురు చూసిన గవర్నర్ గిరీ టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి ని వరించలేదు. దాదాపు మూడు సంవత్సరాలు ఆయన దీనికోసం ఎదురు చూసారు. ఇప్పటికైనా ఆశలు వదిలేసుకున్న ఆయన ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం కలలు కంటున్నారు అని టాక్.


రాజ్యసభ కంటే కూడా ఆయన్ని ఒక మంచి స్థాయి లో కూర్చోబెట్టాలని చంద్రబాబు అనుకునేవారు అందుకే ఒక దళిత నాయకుడు అయిన మోత్కుపల్లి కి గవర్నర్ గిరీ ఏ కరక్ట్ అని అనుకున్నారు బాబు. తన మాట డిల్లీ లో చెల్లకపోవడం తో ఇప్పుడు గవర్నర్ ని మోత్కుపల్లికి కట్టబెట్టలేక బాబు సైలెంట్ ఐపోగా కనీసం ఫిబ్రవరి లో జరిగే రాజ్యసభ ఎన్నికలకి తనకి అవకాశం కల్పించాలి అని చంద్రబాబుని  కోరుతున్నారు.


ఆంధ్రా కోటాలో తెలంగాణ‌కు చెందిన మోత్కుప‌ల్లిని రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం క‌ష్ట‌మే.రాజ్య‌స‌భ సీటు కూడా ద‌క్క‌క‌పోతే మోత్కుప‌ల్లి ఏం చేస్తార‌నేది పెద్ద ప్ర‌శ్న‌గానే ఉంది. తెలంగాణా లో తెరాస తో పొత్తు ని మోత్కుపల్లి తెరమీదకి తీసుకుని వచ్చారు.


ఒక పక్క కాంగ్రెస్ తో పొత్తు కోసం రేవంత్ ప్రయత్నాలు చేస్తూ ఉంటె మరొక పక్క టీడీపీ నీ తెరాస ని కలపాలి అనేది మోత్కుపల్లి ప్లాన్.తెరాస‌తో పొత్తు ప్ర‌తిపాద‌న వెనుక  మోత్కుప‌ల్లి ఆలోచ‌న ఏంటంటే… తెరాస‌, టీడీపీలు పొత్తు పెట్టుకుంటే అప్పుడు రేవంత్ టీడీపీలో కొన‌సాగ‌లేని ప‌రిస్థితి వ‌స్తుంది, ఎందుకంటే తెరాస కీ రేవంత్ కీ పడదు కాబట్టి. సో ఈ కొత్త పొత్తు తో తన రాజ్యసభ సీటు తో పాటు టీటీడీపీ లో తాను కూడా ఒక పెద్ద చేపగా ఎదగవచ్చు అనేది ఆయన ప్రతిపాదన కాబోలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: