ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ అక్టోబ‌ర్ ఎండింగ్ లేదా నవంబ‌ర్ నుంచి షురూ కానుంది. ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే జ‌నాల్లోకి దూసుకుపోయేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నాడు. ప‌వ‌న్ పాద‌యాత్ర ద్వారా ముందుగా క్షేత్ర‌స్థాయిలో జ‌నాల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు స్కెచ్ గీస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ పాద‌యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా దీని మెయిన్ ఫోక‌స్ తెలంగాణ కంటే ఎక్కువుగా ఆంధ్రాలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. 

trivikram srinivas కోసం చిత్ర ఫలితం

ప‌వ‌న్ ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా మారితే జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇస్తే ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు చాలా మంది సెల‌బ్రిటీలు రెడీగా ఉన్నారు. ప‌వ‌న్ వెంట న‌డిచేందుకు త‌ట‌స్థులతో పాటు పొలిటిక‌ల్ నాయ‌కులు, యువ‌కులతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌నసేన‌లో చేరేందుకు ఇద్ద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు కూడా సిద్ధంగా ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.


ఈ ఇద్ద‌రిలో ఒక‌రు ప‌వ‌న్‌కు ఆప్త‌మిత్రుడు అయిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌. ప‌వ‌న్ కెరీర్‌లో ప్ర‌తి విష‌యంలోను త్రివిక్ర‌మ్ గైడెన్స్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన జెండా, ఎజెండాల‌తో పాటు సిద్ధాంతాలు, ప‌వ‌న్ స్పీచ్‌లు, ఇత‌ర పంచ్‌ల్లో కూడా త్రివిక్ర‌మ్ హ్యాండ్ ఉంటుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఇక ప‌వ‌న్ ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా మారితే జ‌న‌సేన తెర‌వెన‌క కార్య‌క్ర‌మాల‌న్ని త్రివిక్ర‌మ్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గ‌నున్నాయి.

dasari maruthi కోసం చిత్ర ఫలితం

ఇక జ‌న‌సేన‌లో చేరే రెండో డైరెక్ట‌ర్‌గా మారుతి పేరు వినిపిస్తోంది. ప‌వ‌న్‌కు, మెగా కాంపౌండ్‌కు వీరాభిమాని అయిన దాస‌రి మారుతి తాజాగా శ‌ర్వానంద్ మ‌హానుభావుడు సినిమాతో హిట్ కొట్టాడు. మ‌హానుభావుడు స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మారుతి తాజా ఇంట‌ర్వ్యూలో తాను జ‌న‌స‌న కోసం ఎలాంటి వ‌ర్క్ చేయ‌డానికి అయినా రెడీగా ఉన్నాన‌ని చెప్పాడు. ప‌వ‌న్ కోసం తాను ఏదైనా చేస్తాన‌న్న హింట్ మారుతి ఇచ్చేశాడు.


ఇక త‌న‌దంతా సినిమా ప్ర‌పంచమే అన్న మారుతి త‌న‌కు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేద‌ని, అయితే ప‌వ‌న్ మీద ప్రేమ‌తో జ‌న‌సేన కోసం మాత్రం ఏదైనా చేస్తాన‌ని చెప్పాడు. ప‌వ‌న్ పార్టీ పూర్తిగా కార్యాచ‌ర‌ణ స్టార్ట్ చేయ‌క‌ముందే ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల పేర్లు జ‌న‌సేన ఎంట్రీలో వినిపిస్తున్నాయి. మ‌రి ప‌వ‌న్ పూర్తి టైం పొలిటిషీయ‌న్‌గా మారితే ఇండ‌స్ట్రీ నుంచి జ‌న‌సేన‌లో చేరిక‌లు మ‌రింత ఎక్కువుగా ఉంటాయ‌న‌డంలో డౌటే లేదు. ఇప్ప‌టికే కొంద‌రు క‌మెడియ‌న్లు జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తామ‌ని ప‌వ‌న్‌కు హామీ ఇచ్చిన‌ట్టు టాక్‌.
 
 pawan kalyan కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: