జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర గురించే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల నుంచీ ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర కి సిద్ధం అవుతూ ఉండడం , ఆయన రాజకీయ భవిష్యత్తు ని ఈ యాత్ర డిసైడ్ చేసేది లాగా ఉండడం తో ప్రతీ ఒక్కరూ ఈ విషయం మీదనే డిస్కషన్ లు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి మీద విమర్సల పర్వం సిద్ధం చేసుకున్నారు టీడీపీ జనాలు.

రీసెంట్ గా కంభం పాటి కూడా జగన్ మీద విరుచుకు పడ్డారు " ఏ వన్ ముద్దాయి గా ఉన్న జగన్ మోహన్ రెడ్డే పాదయాత్ర కి సిద్ధం ఐపోతే జనాలు నవ్వుతారు, జగన్ ని స్ఫూర్తి గా తీసుకుని శశికళ , గాలి జనార్ధన్ రెడ్డి లు కూడా పాదయాత్ర చేసేస్తారు " అంటూ సీరియస్ అయ్యారు ఆయన.

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తాం చేస్తాం అంటూ సాగదీయడం తప్ప రాజీనామాలు చేయించే సీన్ జగన్ కి లేదు అనీ , జగన్ ని జనాలు నమ్మడమే మానేశారు అనీ అన్నారు కంభంపాటి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించిన జగన్ అక్రమ ఆస్తులు జనల చేతుల్లో పెట్టి అప్పుడు పాదయాత్ర చెయ్యాలి అని డిమాండ్ చేసారు.

దీనికి వైకాపా నుంచి కూడా గట్టి సమాధానమే లభించింది. " యాత్ర చేయకూడదు అంటూ టీడీపీ వితండవాదం చేస్తోంది. వితండవాదం చూస్తుంటేనే జగన్ యాత్రకి వారెంత భయపడుతున్నారో తెలుస్తోంది” అంటూ స్పందించారు. యాత్ర దగ్గరయ్యేకొద్దీ మాటల తూటాలు మరింత పేలే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: