తెలంగాణలో దసరా, దీపావళి పండుగలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.  ముఖ్యంగా తెలంగాణలో దీపావళి రోజు నోములు నోచుకోవడం..ఇంటి పెద్దలకు పెట్టుకోవడం అనాధిగా వస్తుంది.  ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అంతా ఆరోజు ఒక్కదగ్గర కలుస్తారు..నోములు నోచుకుంటారు.  అయితే ఈ ఏడాది తెలంగాణ స‌ర్కారు అధికారికంగా విడుదల చేసిన 2017 సెలవుల క్యాలెండర్ లో అక్టోబర్ 18న దీపావ‌ళిగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. 
Image result for deepawali nomulu
కాగా, 19న అమావాస్య రావడంతో  ఉద్యోగం చేసుకునే వారు ఇబ్బందులు పడతారని భావించిన తెలంగాణ సర్కారు..ముఖ్యంగా 19న అమావాస్య ఉంద‌ని సెల‌వు తేదీని మార్చాల‌ని ఉద్యోగ సంఘాలు, అధికారులు, టీచ‌ర్స్ యూనియ‌న్ విన‌తి మేరకు తెలంగాణ‌ ప్రభుత్వం మ‌రోసారి ఆలోచించింది.
Image result for kcr
అప్ప‌ట్లో 17న ఐచ్చిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్ర‌క‌ట‌న చేసిన‌ ప్రభుత్వం.. ఈ రోజు ఐచ్చిక‌ సెలవును 18 వ తేదీకి ఇస్తున్నామ‌ని, సాధారణ సెలవును 19కి మారుస్తున్నామ‌ని అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. గత నెల దసరా వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యోగస్తులకు 25 న జీతాలు అందించిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: