ప్ర‌స్తుతం ``నాకేంటి?`` అనే రోజులు ఇవి! విరిగిన వేలు మీద వాట‌ర్ పోయ‌మ‌న్నా.. నాకేంటి? అనే రోజుల్లోనే మ‌నం ఉన్నాం. కాబ‌ట్టి ఎవ‌రూ ఎవ‌రికీ ఏదీ ఊరికేనే చేయ‌ర‌న్న విష‌యాన్ని మ‌నం స‌ర్వ‌కాల స‌ర్వ‌విధ స‌ర్వావ‌స్థ‌ల్లోనూ గుర్తెరిగి మ‌సులుకోవాలి.  విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నిక‌లు దూసుకు వ‌స్తున్న త‌రుణంలో అధికార టీడీపీని బ‌ద్నాం చేసేలా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. న‌ట‌సార్వ‌భౌన అన్న‌గారి జీవితాన్ని మ‌నం తీసుకుంటే మూడు భాగాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి. 

lakshmi's ntr movie కోసం చిత్ర ఫలితం

ఒక‌టి సినీ జీవితం. రెండు రాజ‌కీయాలు. మూడు అన్న‌గారి లైఫ్‌లోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చాక లైఫ్‌. ఈ మూడింటిలో తొలి రెండూ ఎలాంటి వివాదాలూ యూట‌ర్న్‌లు, విశ్లేష‌ణ‌లు లేక‌పోయినా.. ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చాక అన్న‌గారి జీవితంలో పెను కుదుపు వ‌చ్చింది. పార్టీని సైతం కోల్పోయారు. అదెలా జ‌రిగింది? ఏమిటి? వ‌ంటి కీల‌క అంశాలు నేటికీ వివాదాస్ప‌ద‌మే. అయితే, ఇవన్నీ ఇప్ప‌టి వ‌ర‌కు తెర చాటు వ్య‌వ‌హారంగా ఉండిపోయాయి. ఇప్పుడు వ‌ర్మ వీటిని తెర‌మీద‌కి తెస్తాన‌ని చెబుతున్నాడు. ఇదిలావుంటే, అన్న‌గారి జీవితంలో జ‌రిగిన ఈ కీల‌క ఘ‌ట్టం తెర‌మీద‌కి వ‌స్తే..  బాబు బ‌ద్నాం కావ‌డంతోపాటు త‌మ‌కు లబ్ధి ఉంటుంద‌ని వైసీపీ భావిస్తోంది. 


ఇక‌, ఈ చిత్రానికి   నిర్మాతగా సీమ‌కు చెందిన వైసీపీ నేత‌ రాకేష్ రెడ్డి  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ఈయ‌నకు గ‌తంలో సినిమాలు తీసిన అనుభ‌వం లేదు. బెంగ‌ళూరులో ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ప‌ల‌మ‌నేరు నియోజ‌క వ‌ర్గానికి చెందిన‌వారు. ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి 2014లో వైసీపీ టిక్కెట్ పై అమ‌ర్ నాథ్ రెడ్డి గెలిచారు. కానీ, త‌రువాత ఆయ‌న జ‌గ‌న్ తో విభేదించి టీడీపీలో చేరిపోయి, మంత్రి అయ్యారు. ఆయ‌న వెళ్లాక  ప‌ల‌మ‌నేరులో జ‌గ‌న్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. దీంతో పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారే పెద్ద దిక్కు అయ్యారు. అయితే, వారంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు.

lakshmi's ntr movie కోసం చిత్ర ఫలితం

దీంతో పార్టీ అధిష్టానం ముందు త‌మ బ‌ల‌మేంటో ప్ర‌ద‌ర్శించుకోవాల్సిన ఒక ప‌రిస్థితి స్థానిక నేత‌ల్లో ఏర్ప‌డింది. దీంతో సమన్వయకర్తల్లో ఒక‌రైన రాకేష్ రెడ్డి నిర్మాత అవ‌తారం ఎత్తారు అంటున్నారు! ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా  చంద్ర‌బాబుని విలన్ గా చూపించొచ్చ‌నీ, ఆ ర‌కంగా జ‌గ‌న్ ఆశీస్సులు పొంది, టికెట్ ద‌క్కించుకోవ‌చ్చ‌ని ప్లాన్ చేశాడ‌ట‌.  అందుకే వ‌ర్మ‌కు అస‌లు ఎన్టీఆర్ మూవీ ఆలోచ‌న రావ‌డంతోనే రాకేశ్ ఆయ‌న‌ను ఫోన్లో సంప్ర‌దించి మ‌రీ మూవీకి ప్లాన్ చేయ‌డం గ‌మ‌నార్హం. సో.. ఇలా అన్న‌గారి మూవీని అడ్డు పెట్టి ఎమ్మెల్యే టికెట్ పొందాల‌ని చూస్తున్న రాకేశ్‌పై టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. 

lakshmi's ntr movie కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: