తెలంగాణా సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కాస్తంత అసంతృప్తి తో ఉన్నారు అనే కథనాలు మళ్ళీ ఇప్పుడిప్పుడే తెరమీదకి వస్తున్నాయి. మంత్రి పదవి పోవడం లాంటి విషయాలు ఆయన్ని తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఆ టైం నుంచే ఆయన కాస్త చిరాకుగా ఉన్నా పెద్దగా మాట్లాడింది కూడా ఏమీ లేదు. అలాయ్ బలాయ్ ప్రోగ్రాం లో కూడా వచ్చినవారు అంతా దత్తన్న ని ఓదార్చడం లోనే బిజీ అయ్యారు.

దత్తన్న ని ప్రధాన క్రియాశీలక స్థానం నుంచి పక్కకి పెట్టాలి అనుకున్న అధిష్టానం కి ఏదో ఒక సైడ్ ఐడియా ఉండే ఉండాలి .. అదేంటి అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. పనితీరు బాలేదు అంటూ ఆయన పదవి తీసేయడం అనేది మరింతగా ఆయన్ని తొలచి వేస్తోంది.


సికింద్రాబాద్ పార్ల‌మెంట‌రీ స్థానం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న సంకేతాల‌ను కూడా భాజ‌పా అధినాయ‌క‌త్వం ఇచ్చిన‌ట్టే అనేది కొంద‌రి విశ్లేష‌ణ‌! రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు ఆ రకంగా దత్తన్న వారసులు ఎవరు అనే కొత్త చర్చ మొదలైంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటుకు వెళ్లాల‌నేది పార్టీ అధ్య‌క్షుడు కె. లక్ష్మ‌ణ్ ల‌క్ష్యంగా కొంద‌రు చెబుతున్నారు. అందుకే, ద‌త్త‌న్న‌కు మంత్రి ప‌ద‌వి పోయిన ద‌గ్గ‌ర నుంచి ముంద‌స్తుగా మీద ఆయన ప్రేమ చూపిస్తున్నారు, అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఏమో అనుకున్న తరుణం లో వెంటనే రంగంలోకి దిగుతున్నారు లక్ష్మణ్. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్ ని అడ్డం పెట్టుకునే జాతీయ స్థాయి రాజకీయాలలోకి వెళ్ళాలి అని గట్టిగా పథకం రచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: