మోత్కుపల్లి నరసింహులు జీవితం లో సగం టైం మొత్తం ఆ గవర్నర్ గిరీ కోసం ఎదురుచూడడంలోనే గడిచిపోయింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు మాట ఇచ్చారు అన్న ఒకే ఒక్క ఆశ , కేంద్రం తో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు అన్న విభిన్న ఆలోచన తో ఇన్నాళ్ళూ కళ్ళు కాయలు కాచేలా ఆ పదవి కోసం ఎదురు చూసారు మోత్కుపల్లి. మూడేళ్ళు గా ఇది నడుస్తూ వచ్చింది. చివరకి కేంద్రం ఎవరిని అనుకుందో వారినే గవర్నర్ లు గా సెట్ చేసేసుకుంది.

మోత్కుపల్లి కి ఇక ఈ సీటు దక్కే చాన్సే లేదు అని తేలిపోయింది. దీంతో ఆయ‌న కాస్త అసంతృప్తిగా ఉన్నార‌నే చెప్పాలి. అయితే, ఈ అసంతృప్తిలో కూడా ఓ చిన్న ఆశ ఏంటంటే… రాజ్య‌స‌భ సీటు వ‌స్తుంద‌ని! త‌న‌కు గ‌తంలో చంద్ర‌బాబు ఈ మేర‌కు హామీ ఇచ్చార‌నీ, రాజ్య‌స‌భ‌కు పంపిస్తాన‌ని అన్నార‌నీ, త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌ని ప్ర‌స్తుతం మోత్కుప‌ల్లి చెబుతున్నారు. అంటే, ఓ ర‌కంగా చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్న‌ట్టే క‌దా! ఎలాగూ గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇప్పించ‌లేక‌పోయారు కాబ‌ట్టి, క‌నీసం రాజ్య‌స‌భ‌కైనా ఆయ‌న పంపిస్తార‌నేది మోత్కుప‌ల్లి అంచ‌నా.

తెలంగాణా లో మూడు స్థానాలుతో పాటు ఆంధ్రా లో కూడా మరొక మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. టీడీపీ నేతల్లో ఇప్పటి నుంచే ఎవరికి వారు ఆ సీటు తమదే అనే ఫీలింగ్ తో ఉన్నారు. పార్టీలకి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయి అనేది తేలిపోయింది. సో తెలంగాణా లో టీడీపీ కి దక్కే ఛాన్స్ కష్టమే.

ఏపీ లో టీడీపీ కి రెండు స్థానాల వరకూ రావచ్చు. ఈ సారి ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలి అని ఒత్తిడి ఉంది సో ప్రతిభా భారతి , జూపూడి లో ఒకరికి ఇవ్వచ్చు అంటున్నారు. సామాజిక సమీకరణ లెక్కల ప్రకారం ఒక రాజ్య‌స‌భ స్థానం పోయినా.. రెండో స్థానం త‌న‌కు ద‌క్కుతుంద‌నే ఆశాభావంతో మోత్కుప‌ల్లి ఉన్నారు. ఉండ‌ట‌మే కాదు… ఏపీ టీడీపీలోని స‌హ‌చ‌రుల‌తో ఈ మ‌ధ్య త‌ర‌చూ ట‌చ్ లో ఉంటున్నారనీ, వారి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: