మంత్రి నారాయణ  పాలన కంటే , నారాయణ కాలేజి యజమానిగా ప్రజలకు సుపరిచితులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులతో పాటు, ఈ కాలేజిలో చదివే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్య లు చేసుకుంటుంటారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఈ నారాయణ వియ్యంకుడే. ఫలితంగా ఆ కాలేజిలో జరిగే ఎలాంటి విద్యార్ధుల పై జరిగే అరాచకాలపై  విచారణ చర్యలు ఉండవు. సరిహద్దుల్లో చైనా ఎంత ప్రమాదమో!  విద్యార్దులకు చైనా (చైనా  చైతన్య-నారాయణ విద్యాసంస్థలు )  అంతే ప్రమాదం 


Image result for minister ganta srinivasa rao narayana of ap


మంత్రి నారాయణ కళాశాలలపై చర్యలు తీసుకునే దమ్ముగాని, సామర్ధ్యం కాని ఈ గంటా కు లేవు, కాని అన్నింటికి గంట వాయించటం తప్ప ఆయన చేయగలిగేది ఏమీ లేదు.  ప్రభుత్వం నుండి జరుపవలసిన విచారణలను అపేయ్యటమే ఆయన మంత్రిగా నిర్వహించే బాధ్యత కదా! నారాయణ కాలేజికి ఈ గంటా శ్రీనివాసరావు ప్రభుత్వం నుండి జరుపవలసిన విచారణలను అపేయ్యటమే ఆయన మంత్రిగా నిర్వహించే బాధ్యత కదా! అంటారు బాధితుల తల్లిదండ్రులు.


గంటా శ్రీనివాస రావు, నారాయణలు చేసే పనుల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా  ఇరుకున పడాల్సి వస్తోంది అనికూడా తెలుస్తుంది. ఒక విద్యార్ధి మరణించటం ఏదో ఖర్మ అనో గ్రహచారమనో అనుకోవచ్చు. విద్యార్ధులు పరంపరగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటి ఆధారంగా చర్యలు తీసుకోవటానికి మనస్కరించని ఈ వ్యక్తులు మనకు పాలకులంటేనే సిగ్గుపడాలి.


Image result for minister ganta srinivasa rao narayana of ap


మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుల వ్యవహారశైలి “చనిపోయింది తమ పిల్లలు కాదు”  కదా! అని అనుకుంటున్నరో ఏమో?  తెలియదు. ఈ రెండు కళాశాలల్లో విద్యార్ధులు అతి భారమైన వత్తిడితో సతమౌతున్నారు. అటు తల్లిదండ్రులు, ఇటు కాలేజీ యాజమాన్యాలు ప్రవర్తన విద్యార్ధు ల భవితవ్యానికి చరమ గీతం పాడుతున్నాయి. చదువు, పరిక్షలే పరమార్ధం కాదు. అన్నది గుర్తించి విద్యార్ధుల మనోవికాసానికి సహకరించాల్సిన విద్యాసంస్థలు చెరసాలనే మరిపిస్తుండ టం మన వ్యవస్థకు అవమానం. ఆ కాలేజి విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు


ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లు భరించ లేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువు పేరుతో పెట్టే టార్చర్ మాములుగా ఉండటం లేదు. తినేందుకు, పడుకునేందుకు సమయం ఇవ్వడం లేదు. టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టి వారిని ఏడిపిస్తున్నారు. ఇక ఈ చదువు మాకు వద్దని బలవన్మరణానికి పాల్పడుతున్నారు పిల్లలు. ఇంత జరగుతున్నా కాలేజీ యజమాన్యం పై చర్య తీసుకునే సాహసం చేయడం లేదు ప్రభుత్వం. ఇది చంద్రబాబు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.


Image result for minister ganta srinivasa rao narayana of ap


మూడు రోజుల వ్యవధిలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు. “వేస్ట్ నారాయణ!  కిల్లింగ్ స్టూడెంట్స్. నారాయణ కాలేజీలను మూసేయాలనే నినాదం ఊపందు కుంటోంది. అవే విషయాలను లేఖ రూపంలో  రాసి సాయి ప్రజ్వల అనే అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ర్యాంకులు రావాలనేది నిజమే. కానీ అవి సాధించేందుకు ఎన్నుకునే పద్దతులు నారాయణ కాలేజిలో సరిగా లేవు. చదువు. చదువు. చదువు. మరో వ్యాపకం లేకుండా చేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఊసే ఉండదు. స్వేచ్ఛ అనేది లేకుండా పోతోంది.


వరుసగా జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణపై దృష్టి పెట్టింది. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్య లకు పాల్పడు తున్నఆయా కళాశాలల యాజమాన్యాలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆత్మహత్యలకు గల కారణాలపై పూర్తిగా చర్చించారు. కాలేజీ యాజమాన్యాలకు పలు సూచనలు, హెచ్చరికలు పంపారు. విద్యార్థులను చదివించండి. కానీ టార్గెట్ ల పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని చెప్పారు.


Image result for minister ganta srinivasa rao narayana of ap


నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. విద్యార్థులను రోబోలుగా మార్చే విద్యా విధానాన్ని ఆపాలన్నారు. కార్పొరేట్ కళాశాలలు స్వీయనియంత్రణ పాటించాలని, నాలుగైదు రోజుల్లో మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థులను చదువుకే పరిమితం చేయవద్దన్న సీఎం విద్యార్థుల సోషల్‌ వర్క్ కు 5 శాతం మార్కులు తప్పనిసరని చెప్పారు.


మంత్రి గంటా చేతగాని తనం విద్యార్థులకు శాపంగా మారింది. అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకునే వరకు మంత్రి ఏం చేయలేక పోయారు. చేష్టలుడిగినట్లు చూస్తుండి పోయారు తప్ప ఎలాంటి చర్యలు లేవు. నెలకోసారి కమిటీతో, 3 నెలలకోసారి కళాశాలల ప్రతినిధులతో ఇప్పుడు సి.ఎం సమీక్ష జరుపుతామన్నారు. ఇక ఇంటర్ లో ర్యాంకుల పద్ధతిని ఎత్తివేసి గ్రేడింగ్ విధానాన్ని తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించడం విశేషం.

శ్రీచైతన్య’పై  ప్రైవేటు కేసు:  


ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్‌ నుంచి గెంటివేయడంపై కర్నూలు కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. ఇందులో కళాశాల యాజమాన్యానికి సహకరించిన పోలీసులపైనా మరో ఫిర్యాదు దాఖలైంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేతంచర్లకు చెందిన డి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి కుమార్తె కర్నూలు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతుండేది. ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో 2014 ఏప్రిల్‌ 8న అర్ధరాత్రి కళాశాల యాజమాన్యం హాస్టల్‌ నుంచి గెంటేసింది. అప్పట్లో ఆ విద్యార్థిని తండ్రి కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.


ఈ కేసును కొట్టివేయాలని కళాశాల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. సదరు కేసు దర్యాప్తు చేయాలని కర్నూలు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ కేసులో పోలీసు అధికారులు ఫిర్యాది  మరియు బాధితురాలిని విచారించకుండానే తప్పుడు కేసంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు.


దీంతో ఫిర్యాది తిరిగి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు.  శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం, కర్నూలు పోలీసులపై చర్యలు చేపట్టి, తనకు న్యాయం చేయాలని న్యాయ స్థానాన్ని కోరారు. ఈ కేసు ఈనెల 25న  విచారణకు రానున్నట్లు ఫిర్యాది తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: