భారత దేశంలో ఇప్పుడు సెల్ ఫోన్ యూజింగ్ సర్వసాధారణమైంది..ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే ఉంది.  దేశంలో ఉన్న నెట్ వర్క్ సంస్థలు మద్య విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల యూజర్ చార్జీలు విపరీతంగా తగ్గిస్తున్నారు.  దీంతో ఇంటర్ నెట్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది.  అయితే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ లేదా ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం కల్పిస్తుంది.
Image result for hackers
తాజాగా పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్న వారికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈటీటీ) హెచ్చరికలు జారీ చేస్తోంది.  ఇప్పుడున్న బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్, ల్యాప్ ట్యాప్ పట్టుకుని యువకులు, నిపుణులు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రయాణ సమయం వృధాకాకుండా బ్రౌజ్ చేస్తుంటారు.
Image result for కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్
అయితే ఇలా  బ్రౌజింగ్ చేస్తున్న వారిపై హ్యాకర్లు కన్నేశారని ప్రభుత్వ సైబర్ ఏజెన్సీ సీఈటీటీ తెలిపింది.  ఇలా  ఇంటర్‌ నెట్ బ్రౌజింగ్ యడంవల్ల ఫోన్లలో నిక్షిప్తమై ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు, పాస్‌ వర్డ్‌ లు, ఛాట్ మెసేజ్‌ లు, ఈ మెయిల్స్ వంటి వాటిని తస్కరించే అవకాశం ఉందని తెలిపారు. నెటిజన్లు వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ను వినియోగించాలని సూచించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: