గత కొన్ని రోజుల నుంచి భారత దేశంలో హాట్ టాపిక్ గా మారిని గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ గుర్మిత్ బాబా కేసులో కొత్త కొత్త ట్విస్టులు బయటపడ్డాయి.  అయితే గుర్మీత్ అరెస్టు సందర్భంగా అల్లర్లకు కుట్ర పన్నిందనింటూ ఆయన దత్త పుత్రిక  హనీప్రీత్‌ సింగ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  అదే సమయంలో హనీప్రీత్ సింగ్ దాదాపు నెల రోజులు కనిపించకుండా పోయింది..ఆమె నేపాల్ కి పారిపోయిందని, బీహార్ లో ఉందని రక రకాల వదంతులు వినిపించాయి. 
Image result for hani preet singh crying
ఎట్టకేలకు ఢిల్లీలో పోలీసులు హనీప్రీత్ ని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.  ప్రస్తుతం హనీప్రీత్ హర్యాణాలోని అంబాలా జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తుంది. అరెస్టుకు ముందు తాను నిర్ధోషిని అని తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి తనపై నేరారోపణ చేస్తున్నారని వాదించిన హనీప్రీత్ సింగ్ కస్టడీ తర్వాత నిజాలు బయట పెట్టింది. 
Image result for hani preet singh gurmit
గుర్మీత్ అరెస్టు సందర్భంగా అల్లర్లకు కుట్ర పన్నినట్లు కొంత మందికి డబ్బు ఇచ్చినట్లు ఒప్పుకుంది.  తాజాగా హనీప్రీత్ సింగ్ ని పరామర్శించేందుకు ఆమె తల్లిదండ్రులు వెళ్లారు. కాగా, దీంతో హనీప్రీత్‌ ను ఆమె తల్లిదండ్రుల గురించి వివిధ వివరాలు ఆరాతీసిన తరువాత..ఆ వివరాలు నిర్ధారించుకుని వారు ఆమె తల్లిదండ్రులుగా గుర్తించి, ఆమెతో మాట్లాడేందుకు అనుమతించారు పోలీసులు. 
Image result for hani preet singh gurmit
ఆమె తల్లిదండ్రులు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ లను చూసి ఆమె కన్నీరుమున్నీరైంది.   దీపావళిని పురస్కరించుకుని కొవ్వొత్తులు, స్వీట్లు ఆమెకు కానుకగా అందజేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: