ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి యోగి ఆదిత్యనాధ్‌ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.  అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ క్షమించేది లేదని పలు సందర్భాల్లో రుజువు చేశారు.  తాజాగా మరో సంచలన నిర్ణయంతో అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ప్రభుత్వ కార్యాలయాల సందర్శనకు వచ్చినప్పుడు అధికారులు లేచి నిలబడి, గౌరవ పూర్వకంగా స్వాగతం పలకా లని యోగి ఆదిత్యనాధ్‌ సర్కారు వెల్లడించింది.
Image result for yogi adityanath
ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ప్రొటోకాల్‌లో భాగం గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు.  ఈ మద్య అధికారులెవ్వరూ తమకు గౌరవం ఇవ్వలేదని సీఎంకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా మొర పెట్టుకుంటున్నారని, ఈ క్రమం లోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయని సమాచా రం.
Related image
ఫిర్యాదు చేస్తే ఘాజీపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌.. కొద్ది నెలల క్రితం కలెక్ట ర్‌ కార్యాలయం ఎదుట బైటాయించారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం యోగి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

ఇక నూతన ఆదేశాల ప్రకారం.. సందర్శన, తనిఖీలకు వెళ్లే చట్టసభ సభ్యు లకు అధికారులు లేచి నిలబడి స్వాగతం పలకాలి. వారు వెళ్తున్నప్పుడు కూడా అంతే మర్యాద పూర్వకం గా వీడ్కోలు చెప్పాలి. ఈ నిబంధనలను ధిక్కరించిన అధికా రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: