భూమిపై ఇప్పటి వరకు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.  అయితే శాస్త్ర పరిశోధనల వల్ల కూడా కొన్ని ప్రత్యేక జీవరాసులను సృష్టిస్తున్నారు. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే ఎన్నో పరిశోదనలు చేశారు శాస్త్రవేత్తలు.  అయితే భూమిపై అప్పుడప్పుడు వింత వింత జంతువులు దర్శనం ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. 

సాదారణంగా మన మద్య తిరిగే సాదు జంతువులకు కూడా కొన్ని జన్యులోపం వల్ల వింత ఆకారాలతో జంతువులు జన్మిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అభివృద్ది చెందినప్పటి నుంచి ఇలాంటి న్యూస్ అప్పుడప్పుడు చూస్తున్నాం. తాజాగా మలేషియా మీడియాలో వింత ఆకారం హల్ చల్ చేస్తోంది. మనిషిని పోలిన తల, తోడేలు పళ్లు, పిల్లిని పోలిన శరీరం ఇలా ఉంది ఆ వింత జీవి. 

అయితే ఇది ఏలియన్ అయి ఉండొచ్చని కొందరు అంటుంటే..కాదు ఇది తోడేలు పిల్ల అని కొందరు..లేదు ఇది ఖచ్చితంగా పిల్లి పిల్ల అని మరికొందరు అంటున్నారు.  ఓ ఇంటి గార్డెన్ లో తిరుగుతుండగా దాన్ని వీడియో తీసి పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

వెస్టర్న్ మలేషియాలో ఇది సంచరిస్తున్నట్టు చెబుతున్నారు.  కాకపోతే ఈ విషయంపై మలేషియన్ పోలీసులు ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు..పైగా ఇవన్నీ రూమర్లు అని కొట్టి పడేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. మరికొందరు మాత్రం అది ఓ లాబరేటరీలో ఉన్నట్టు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: