సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున అమరావతి లో నవ్యాంధ్ర రాజధాని కోసం శంకుస్థాపన జరిగింది. రెండేళ్ళ క్రితం ప్రధాని మోడీ చేతుల మీదగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన పడింది. 2050 నాటికి ప్రపంచం లోనే గొప్ప నగరాల్లో ఒకటిగా ఈ నగరం సిద్దం అవ్వాలి అనేది చంద్రబాబు, మోడీ అప్పుడు అనుకున్న మాట. దీని ప్రకారమే గొప్ప గొప్ప ప్రణాలికలు రచించారు కూడా.

రెండేళ్ళ లో అమరావతి ఎంతవరకూ డెవెలప్ అయ్యింది అనేది చూస్తే .. రాజధానికి గుండెకాయ అని పిలిచే సీడ్ క్యాపిటల్ 1694 హెక్టార్లలో కీలక ప్రాంతం. ఐదు దశల్లో అభివృద్ధి చేయనున్న దీనిలో మూడు లక్షలమంది  జనాభా నివసించేలా నిర్మించనున్నారు. సీడ్ క్యాపటిల్ అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.

ప్రధాన పరిపాలనా నగరానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే ఓకే అయినట్టు తెలుస్తోంది. మరొక పక్క అసంబ్లీ ,హై కోర్టు, సచివాలయం ఇలా అన్ని నిర్మాణాలకీ సంబందించిన డిజైన్ లు ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. . ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయానికి వెళ్లి డిజైన్లను పరిశీలించనున్నారు.

రాష్ట్రం విడిపోయిన తరవాత 15 సంస్థలని కేంద్రం మనకి కేటాయించగా వారికి స్థాలాలు ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సో వారి కార్యకలాపాలు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ఇక మంగళగిరి వద్ద 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1684 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘ఎయిమ్స్’ పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా అనేక పెండింగ్ పనుల మధ్యన, ఫండ్స్ సరిగ్గా లేక అమరావతి - ప్రపంచ ప్రఖ్యాత నగరం అనే పేరు ఆదిలోనే ఫెయిల్యూర్  గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: