ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ పోకడల్లో విలక్షణమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో మార్పులు ఏవిధంగానైనా జరగొచ్చు. ప్రేమలో రాజకీయా ల్లో మార్పులు రావటానికి ఎలాంటి నియమ నిబందనలు ఉండవు. ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఏవరూ ఉండరు. వ్యూహాల చదరంగమే రాజకీయం. అంతిమ లక్ష్యం అధికారం, పదవీ లాలస.


Image result for modi kcr cbn

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలన తెలుగుదేశం - బారతీయ జనతా సంకీర్ణం నడిపిస్తుంది. అయితే పైచేయి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీదే. ప్రజాభిమానం టిడిపి వైపే ఉంది. ప్రతిపక్షంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్.సి.పి, బలమైన ప్రతిపక్షంగా ఉద్భవించగా, ఆ తరవాత అధికార తెలుగు దేశం పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించ గా రాజకీయంతో వైసిపి ఎమెల్యేలను గోడ దూకించగా ఇప్పుడు ప్రతిపక్షం కొన ఊపిరితో కొనసాగు తూ ఉంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ అవినీతి కేసులను సి బి ఐ, ఈ డి కేసులను ఎదు ర్కొంటూ ఉండటమే. ఇప్పుడు వైసిపికి బలమైన రాజకీయ ఆసరా కావాలి.

 

ప్ర‌స్తుతం ఏపి లో రూపుదిద్దుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ 2019 ఎన్నిక‌ల‌ను లక్ష్యంగా చేసుకోంటున్నయని అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ తో తమ పొత్తును కొన‌సాగించటం తెలుగుదేశం పార్టీకి తప్పని సరి. ఎందుకంటే, ఏమాత్రం  ఈ  పొత్తు ప‌ట్టు స‌డ‌లినా వైసిపి భాజ‌పా లో చేరికకు సిద్ధంగా ఉంది. చేర్చుకునేందుకు భాజ‌పా వెన‌కాడే ప‌రిస్థితీ దాదాపు ఉండ‌క‌పోవ‌చ్చు. అలాగ‌ని, టీడీపీ ఒంటరిగా  భాజ‌పాతో పొత్తు కోసం పాకులాడితే, సందు దొరికింది కదాని బాజపా చంకనెక్కి కోరగా  ఆ గొంతెమ్మ కోర్కెలు తీర్చాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది.

 Image result for modi kcr cbn


వైసిపి ని చూపించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు అడిగే అవ‌కాశం పొత్తులో భాగంగా బాజపా డిమాండ్ చేసే ఉంటుంది. అంటే, పొత్తుల కూర్పులో భాజ‌పా దే పైచేయి అయ్యే అవ‌కాశం ఉంది. పొత్తు ఉండాలీ, కానీ, తన మాటే నెగ్గాలంటే టీడీపీ ఏదైనా కొత్త ఆక‌ర్ష‌ణ సంతరించుకోవాలి. అది భాజ‌పాకి ఆకర్షనీయంగా క‌నిపించాలి. అయితే అలాంటి అవకాశాలు ఏర్పడటానికి ఆస్కారం ఏమాత్రం లేదు.


Image result for modi kcr cbn


కారణం కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మాణం లో ఇంకా ఆకృతుల విషయంలోనే తుది నిర్ణయాలు చేయలేని పరిస్థితి. పోలావరం కాంట్రాక్టర్ పనిచేసే సమయములో చేయివ్వగా ఆ సంస్థతో ముఖ్య మంత్రి అనుయాయులకే దగ్గర సంబంధాలున్న దాఖలా లు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.

 

అయితే ఏదో ఆక‌ర్ష‌ణ లేకుంటే బాజపాతో పొత్తు ఈ సారి అసాధ్యం. ఆలస్యమైతే వైసిపి బాజపాతో అంటుకుపోయే అతి సున్నిత పరిస్థితి. అందుకే సిబిఎన్ వ్యూహం తెరాస‌తో పొత్తు పెట్టు కుంటే అది త్రిముఖ వ్యూహంగా మారుతుంది అంటే ఆంధ్ర ప్రదేశ్ లో యధాస్థితిని కొనసాగించినా - తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి తో టిడిపి సన్నిహిత బంధం పెనవేసు కుంటే రెండు రాష్ట్రాల్లో మొత్తం మీద పార్లమెంట్ సభ్యుల సంఖ్యలో ఎక్కువగా గెలవచ్చు. అలాగే విధాన సభ సభ్యుల సంఖ్య లో కూడా అదే విధానం పాటిస్తే ఇరు రాష్ట్రాల్లో యధాతథ స్థితిలో అధికారం లోకి రావచ్చు. కాకపోతే బాజపాకు ఎక్కువ పార్లమెంట్ సీట్లను పెంచితే ఆ ఆకర్షణకు బాజపా పడి పోతుందనేది తెలుగుదేశం ఆలోచన కావచ్చు.


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచనలనుండి చూసినా ఆయ‌న కోరుకునేదీ ఆయన పాకులాడుకున్రేది దాదాపు ఇలాంటి పొట్టు మాత్రమే. ఎలాగూ భాజ‌పాతో పొత్తు కోసం ఆయ‌నా పాకులాడినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో మైత్రికి అంగీకరించే పరిస్థితి లేదు ఆహ్యనకు. కాబ‌ట్టి, కేసీఆర్ కూడా భాజ‌పా పొత్తునే కోరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

 Image result for modi kcr cbn

తెలంగాణ‌లో భాజ‌పాతో పొత్తు ఏర్పడ్డా స‌ర్దుబాటు వ్య‌వ‌హారంలో తన పొరుగు రాష్ట్రం ఏపీలో టీడీపీకి ఎదురయ్యే పరిస్థితులే కేసీఆర్ కు ఎదురుకావొచ్చు. భాజ‌పా చెప్పిన‌ట్టు న‌డుచు కోవాల్సిన ప‌రిస్థితి ఎదురవకతప్పదు. అలా కాకుండా, త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించాలంటే ప్రతిపక్ష సభ్యులను మళ్ళా గోడదూకించే కార్యక్రం మొదలెట్టాలి. అదీ సారి సాధ్యం కాకపోవచ్చు. అందుకే తెరాస‌కు కుడా కొత్త రాజకీయ హంగులు పొంగులు కావాలి. అది తెలుగు దేశం తో పొత్తు ద్వారా సాధ్యం కావచ్చు. అయితే నిప్పులో ఉప్పులాంటి వీరి సంభందాల రూపురేఖలు మార్చుకొని ఇద్ద‌రు చంద్రులు ఐఖమత్యం దిశగా అడుగులు వేయాలి.

 

దీనికి తెలంగాణాలో ప్రధాన అడ్డంకి రేవంత్ రెద్ది. కెసిఆర్-రెవంతుల సంభందాలు అత్యంత దయనీయ స్థాయిలో ఉన్నాయని అందరికీ తెలుసు. కెసిఆర్ కు కాంగ్రెస్ తో సంభందాలు నచ్చవు. అందుకే ఆయన వ్యూహం ప్రకారం రెవంత్ రెడ్డిని కాంగ్రెస్ వైపు తరిమేసే వ్యూహం రచించారు. దానికి చంద్రబాబును ఒప్పించటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఓటుకు నోటు రెండవది కుల సమీకరణం (వెల్ కం) ఈ రెండూ ప్రయోగించారు కేసిఆర్. కాగల కార్యం గంధర్వులు చేసినట్లు తన అంతర్లీన కోరికే కెసిఆర్ తీర్చటం ఉభయతారకం గా సిబిఎన్ కు కలసివచ్చింది.   


 Image result for kcr cbn revanth reddy


ఒక్కో రాష్ట్రాన్ని విడతల వారీగా లక్ష్యం చేసుకుని తమ అదీనం లోకి తెచ్చుకొని పూర్తి సామంత రాజుల్ల గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రక్రియ బాజపా ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలు సైతం వారికి అదే లెక్కలోకి వస్తాయి. బాజపా వ్యూహాల‌ను అడ్డుకునేంత బ‌లం ఈ రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌కు ఉండే అవకాశమే లేదు.

 

 సంధానకర్త వెంక‌య్య నాయుడు గారు ఉప రాష్ట్రపతి హోదాలో ఉండటంతో ఇప్పుడు చంద్ర‌బాబుకి అందుబాటులో లేరు! అలాగే కెసిఆర్ కు కూదా! తెలంగాణ విష‌యంలో తెరాస‌తో పొత్తుకి అంగీకరించకపోతే కాంగ్రెస్ తో జ‌త‌కట్టటానికి రేవంత్ రెడ్డి సిద్ధమై పోతున్నాడు. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై పడి ప్రతిపక్ష నాయకుణ్ణి స‌మ‌ర్థంగా ఎదుర్కొనే వ్యూహానికి పెద్ద అవరోధం ఏర్పడవచ్చు. ఏ రకంగా చూసుకున్నా ఈ "ఇద్ద‌రు చంద్రుళు" కూడా ఒకేరకంగా వత్తిళ్ళాకు గురౌతున్నారు. బాజపాతో లింక్ తప్పని పరిస్థితి. కాకపోతే అదనపు బలం బలగం అవసరమౌతున్న తరుణంలో ఇద్దరు చంద్రుల రాజకీయ ఐఖమత్యం అనివార్యం.

 

 భాజ‌పా వ్యూహం విశ్లేషిస్తే, రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కు వీలైన‌న్ని త‌క్కువ లోక్ స్థానాలు మాత్రమే ద‌క్కేలా చేసి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే పని బాజపా కీల‌క వ్యూహం. భాజ‌పా అధికారంలో ఉన్న‌ రాష్ట్రాల్లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఉభయ తెలుగు రాష్ట్రాల బలం పెరగపోవటం, పెరిగే సూచనలు కనిపించక పోవటం తో వారికి అటు తెలుగు దేశం, ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి తో ఎన్నికల పొట్టు అనివార్యమే. అయితే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాధ్య‌మైన‌న్ని లోక్-సభ సీట్లు ద‌క్కించుకోవ‌డం భాజపాకి చాలా అవ‌స‌రం.


Related image 

 

కాబ‌ట్టి, ఈ మూడు పార్టీలు పొత్తులకు సై అనకపోతే రాజకీయ ప్రయ్పజనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్దించేలాగా లేవు. ఈ ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ వెన‌క ఇద్ద‌రి చంద్రులు చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నరని అనుకోవచ్చు.

 

అయితే ఇక్కడ రెవంత్ రెడ్డి ఏం చెయ్యబోతున్నారనేది చెక్-పాయింట్ అవుతుంది. రెపటి గుజరాత్, హిమాచల్ ఎన్నికలలోని జయాప జయాలు కూడా భవిష్యత్ నిర్నయాలని శాసించే అవకాశాలున్నాయి. గుజరాత్ లో ఏమాత్రం తేడా వచ్చినా టిడిపి పట్టు తప్పి స్వంతంగానో, జనసేన తోనో జోడీ కట్టవచ్చు. అయితె ఎడ్జ్ కోసం సిబిఎన్ ఎప్పుడూ పొత్తులకు సిద్ధంగా ఉంటూనే వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఆయన రాజనీతి. 

 

 Image result for kcr cbn revanth reddy


మరింత సమాచారం తెలుసుకోండి: