వీడు  మామూలోడు కాదు.. డైలాగ్ కాస్త పాతదే అయినా ఈ ఢిల్లీ కేటుగాడికి మాత్రం బాగా అతికినట్లు సరిపోతుంది. కునాల్ అనే ఈ వాహనాల దొంగ ఢిల్లీలో చాలా దొంగతనాలు చేశాడు. వీడి కంటపడితే ఎలాంటి వాహనమైనా మాయమవ్వాల్సిందే. అలాంటివాడు హఠాత్తుగా మాయమయ్యాడు. ఈ మధ్యే అనుకోకుండా పోలీసులకు దొరికిపోయాడు. పట్టుబడకుండా ఉండటానికి వాడు వేసిన మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.కునాల్ ఢిల్లీలో 62 వాహనాలు కొట్టేశాడు. పోలీసులు తనకోసం వేట ప్రారంభించేసరికి మాయమైపోయాడు.


తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. గుర్తుపట్టకుండా తయారయ్యాడు. దర్జాగా కొత్త లైఫ్ ప్రారంభించాడు. అక్కడైనా కుదురుగా ఉన్నాడా అంటే అదీ లేదు. మళ్లీ పాతపనిలోకే దిగాడు. అనుకోకుండా పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అనుమానంతో నాలుగు పీకితే అసలు విషయం బయటపడింది. వాడే వీడని తెలుసుకుని వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది.


పోలీసులకు దొరక్కుండా పారిపోవడం వరకూ ఓకే కానీ ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడాలు సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు ఓ దొంగ ఇలా చేయడంతో అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యింది.అదిసరే ఇన్నిదొంగతనాలు చేసి ఏం  వెనకేశాడయ్యా అంటే అప్పులేనట. కునాల్ మంచి జల్సారాయుడు. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారికోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఆ ఖర్చుల కోసం కార్లు ఎత్తుకెళ్లేవాడు. కునాల్ కు సహకరించిన ఇద్దరు కూడా ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: